కాజల్ అగర్వాల్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తెలుగు సినిమా రంగంలోకి లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరసగా టాప్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ లు దక్కించుకొని ఇప్పటి వరకు సర్వైవ్ అవుతూ వస్తున్నది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన కాజల్, గత కొంతకాలంగా సక్సెస్ కు దూరంగా ఉంటున్నది. సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. మెగాస్టార్ కమ్ బ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 తరువాత కాజల్ కు పెద్ద హిట్ లేదు.
ఇప్పుడు శంకర్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నది. ఇదే ఆమె చేతిలో ఉన్న పెద్ద సినిమా. తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. అయితే, మెగాస్టార్ కొరటాల కాంబినేషన్లో రాబోతున్న 152 వ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుందనే టాక్ వచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉన్నది. అవకాశాలు క్రమంగా తగ్గిపోవడంతో.. కాజల్ కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించింది. వెంటనే వెబ్ సీరీస్ లోకి అడుగుపెట్టింది.
తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ వెబ్ సీరీస్ లో కాజల్ లీడ్ రోల్ చేస్తోందట. ఆన్లైన్ స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ ఈ సీరీస్ ను ప్రసారం చేస్తోంది. ఈ సీరీస్ విజయం సాధిస్తే.. కాజల్ వెబ్ సీరీస్ రంగంలో పెట్టుబడులు పెట్టి నిర్మాతగా మారడానికి సైతం రెడీ అవుతుందనడంలో సందేహం అవసరం లేదు. నటిగా అవకాశాలు తగ్గిపోతే నిర్మాతగా మారాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది.
ఇప్పటికే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన కాజల్ జ్యువెలరీ బిజినెస్ లో బిజీ అయ్యింది. ఇప్పుడు వెబ్ సీరీస్ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఇప్పటికే 35 ఏళ్ళు వచ్చాయి.. పెళ్లి ఎప్పుడు అని అడిగితె ప్రభాస్ చెప్పినట్టుగానే సమాధానం చెప్పకుండా దాటేస్తోంది. ఖాళీ సమయం దొరికినపుడు చెల్లెలు కొడుకుతో ఎంజాయ్ చేస్తున్నది కాజల్.