గ్యాంగ్ లీడర్ అంటే అందరూ చిన్న సినిమా అనుకున్నారు. నిజమే అందరూ అనుకున్నట్టే నాని గ్యాంగ్ లీడర్ సినిమా బడ్జెట్ ప్రకారం చిన్నదే. కానీ హిట్ మాత్రం పెద్ద హిట్ ఏ కొట్టింది గ్యాంగ్ లీడర్ చిత్రం. నాని కథానాయకుడిగా ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయకగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్. మెగా స్టార్ సినిమా టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు మొదట న్యాయం చేస్తాడో లేదో అని ఆలోచించిన ఇప్పుడు సూపర్ అని అంటున్నారు మెగా అభిమానులు.         

 

 
మెగా అభిమానులే సూపర్ అన్నారు అంటే ఇంకా సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి. గ్యాంగ్ లీడర్ సినిమా అద్భుతంగా ఉంది అనే చెప్పచు.. ఎందుకంటే సినిమా క్రిటిక్స్ సైతం సినిమా అద్భుతం కొంచం కథ ఫాస్ట్ గా వెళ్లుంటే సినిమా ఇంకా అద్భుతం అనే రాశారు. నాని గ్యాంగ్ లీడర్ లో ఉన్న టీం చాలా చక్కగా నటించారు. హీరోయిన్ కూడా అంతే ఆ సినిమా మొదటి సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.          
 

 

 
ఇంకా ఇక్కడే అండి స్పెషల్.. ఎక్కడ అని అనుకోకండి సినిమాలో విలన్ పాత్రనే చాలా ప్రత్యేకంగా ఉంది. సినిమా చూస్తే విలన్ అంత బాగా నటించడానికి ఒకరకంగా దర్శకుడే కారణం అని చెప్పచ్చు. దర్శకుడు సినిమాలో కొన్ని కొన్ని చోట్ల మిస్ అయినప్పటికీ మిగితా సినిమా అంత సూపర్ అని చెప్పచు. ప్రేక్షకులు కూడా నాని భాయ్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. అంటే ఈ రివ్యూ బట్టి చూస్తే ఈ వారానికి 'విన్నర్' గ్యాంగ్ లీడర్ అని చెప్పేయచ్చు

 

మరింత సమాచారం తెలుసుకోండి: