‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అత్యంత ఘనంగా హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో ఈనెల 18న నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు అప్పుడే మొదలైపోయాయి. దాదాపు లక్షమంది మెగా అభిమానులు ఎక్కడ నుంచి చూసినా కనిపించే విధంగా భారీ స్టేజ్ ని నిర్మిస్తున్నారు. ఈ ఈవెంట్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత భారీ ఈవెంట్ గా మారబోతోంది. 

చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజమౌళి మంత్రి కేటిఆర్ అమితాబ్ లతో పాటు ఈ ఫంక్షన్ కు రజినీకాంత్ ను కూడ రప్పించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రామ్ చరణ్ చేస్తున్న ఏర్పాట్లు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న అల్లు శిరీష్ ‘సైరా’ మూవీ షూటింగ్ స్పాట్ లో తాను చిరంజీవి అనితాబ్ లతో కలిసి తీయించుకున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘సైరా’ ట్రైలర్ పై స్పందించే విషయంలో ఆలస్యం చేసిన అల్లు శిరీష్ ఇప్పుడుమటుకు ఆలస్యం చేయకుండా ‘సైరా’ షూటింగ్ స్పాట్ లో ఉన్న తన ఫోటోను షేర్ చేసి మావయ్య చిరంజీవి పై ప్రశంసలు కురిపించాడు. 

ప్రస్తుతం శిరీష్ కు ఒక మంచి హిట్ కావలసిన నేపధ్యంలో అతడితో సినిమా చేయగలిగే దర్శకుల కోసం అన్వేషణ సాగుతోంది. స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగి శిరీష్ కోసం ఒక మంచి కథను చెప్పమని యంగ్ డైరెక్టర్ ను అడుగుతున్నా వారంతా మౌనం వహిస్తూ స్పందించక పోవడం శిరీష్ ను కలవర పెడుతున్నట్లు టాక్. అల్లు కాంపౌండ్ లాంటి భారీ సంస్థ సపోర్ట్ ఉన్నా శిరీష్ ఇంకా రాణించక పోవడం చూస్తుంటే ఏవ్యక్తికి అయినా అదృష్టం ఎంత అవసరమో అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: