ఈరోజు విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమాకు ప్రీమియర్ షోల నుండే బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల నుండి నెగిటివిటీ లేకుండా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్ మాత్రమే. నాచురల్ స్టార్ నాని నాచురల్ అభినయంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రతిభ, కార్తికేయ అభినయం సినిమాను బ్లాక్ బస్టర్ చేసాయి. ఈ వీకెండ్లో కుటుంబ సమేతంగా సినిమా చూడాలనుకునే వారికి గ్యాంగ్ లీడర్ ఒక మంచి ఛాయిస్ అవుతుంది. 
 
గ్యాంగ్ లీడర్ సినిమా కథ విషయానికి వస్తే పెన్సిల్ పార్థసారథి (నాని) రివేంజ్ స్టోరీ కథలు రాస్తుంటాడు. అన్యాయానికి గురైన ఐదుగురు ఆడవాళ్లు ప్రతీకారం తీర్చుకోవటం కొరకు పెన్సిల్ సహాయం కోరతారు. ఈ ఐదుగురు ఆడవాళ్లకు వచ్చిన సమస్య ఏమిటి? దేవ్ (కార్తికేయ) ఈ ఐదుగురు ఆడవాళ్లకు చేసిన అన్యాయం ఏమిటి ? నాని ఏ విధంగా ఐదుగురికి సహాయం చేశాడు ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. 
 
సినిమా మొదలైనప్పటినుండి చివరివరకు కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వటంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. లక్ష్మి, వెన్నెలకిషోర్, నాని మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమాలో కథానుసారం వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటున్నాయి. ఇప్పటివరకు హీరోగానే మెప్పించిన కార్తికేయకు విలన్ గా కూడా ఇకముందు అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. 
 
సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావటంతో వీకెండ్ వరకు టికెట్స్ బుకింగ్ జోరుగా జరుగుతోంది. వీకెండ్ వరకు మేజర్ థియేటర్లలో టికెట్స్ దొరకని పరిస్థితి ఉంది. గ్యాంగ్ లీడర్ సినిమా టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లకు పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలాంటి మంచి సినిమాలు చాలా ఆరుదుగా మాత్రమే వస్తాయి.ఇప్పటివరకు సినిమా టికెట్లు ఎవరైనా బుక్ చేసుకోకపోతే వెంటనే బుక్ చేసుకోండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: