ఒకప్పుడు దర్శకులు చెప్పినట్టుగా హీరోలు వినేవారు.  నిర్మాతలకు గౌరవం ఇచ్చేవారు.  ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.  దర్శకుడు కథ చెప్పిన తరువాత నచ్చినా అందులో మార్పులు చెప్తుంటారు.  హీరో ను ఎలా ఎలివేట్ చేయాలో సూచనలు ఇస్తుంటారు.  కెమెరా ఎలా ఉండాలి.. ఎలాంటి లైట్స్ వాడాలి.. షాట్ ఎలా రావాలి అనే విషయాల గురించి పెద్ద డిస్కషన్ చేస్తుంటారు.  దీంతో దర్శకులు ఏం చెప్పాలని వస్తారో.. ఏం తీయాలని అనుకుంటరో అది స్క్రీన్ పై చాలా వరకు కనిపించదు.  తన విజన్ మారిపోతుంది. ఫలితంగా సినిమాలో గందరగోళం.. పరాజయం.. నిర్మాత జేబుకు చిల్లులు.  మరో సినిమా చేయమంటే నిర్మాత ఎందుకు చేస్తాడు.  మరో సినిమా అవకాశం ఇవ్వమని దర్శకుడు అదిరితే నిర్మాత ఎందుకు ఇస్తాడు చెప్పండి.  


అయితే, పూర్వకాలంలో అలా ఉండేది కాదు.  నటీనటులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పోతారు అంతే.  ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని శాసించిన ఎన్టీఆర్, ఏ ఎన్నార్ లు కూడా దర్శకులు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోతారు.  వారి విషయంలో జోక్యం చేసుకోరు.  షాట్ రెడీ అయ్యే సరికి సెట్స్ లో ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతారు.  ఎలా చేయమంటే అలా చేస్తారు.  అంతకు మించి ఒక్క మాట కూడా అడగరు.  ఏవైనా డౌట్స్ ఉంటె అసిస్టెంట్ ను పిలిచి అడుగుతారు తప్పించి డైరెక్ట్ గా డైరెక్టర్ తో డిస్కస్ చేయరు.  


ఎన్టీఆర్ దర్శకుడిగా మారిన తరువాత తాను నటిస్తూనే దర్శకుడిగా నటీనటులకు సూచనలు ఇస్తూండేవాడు.  డైరెక్టర్ గా చేయాల్సిన బాధ్యతను చేస్తూ.. నటుడిగా చేయాల్సింది చేసేవారట.  అందుకే ఈ ఇద్దరి నటులతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు అప్పటి దర్శకులు.  అయితే, సినిమల్లో విలన్ గా చేసిన రాజనాల ఈ విషయంలో డిఫరెంట్ గా ఉండేవారు. రాజనాల విలన్ గా నువ్వానేనా అనే సినిమా తీస్తున్నారు.  ఆ సినిమాలో కాంతారావు హీరో.  భావ నారాయణ నిర్మాత. శేషగిరి రావు దర్శకుడు.  కుర్తాళం అడవుల్లో షూట్ జరుగుతున్నది.  ఆ సమయంలో రాజనాల కెమెరా అక్కడ పెట్టు.. ఇక్కడ పెట్టు అనిఇస్తుండటంతో .. నిర్మాత అక్కడికి వచ్చి రాజనాల దర్శకుడిని నిదానంగా తీయని.. ఊరికి కన్ఫ్యూషన్ చేయకు.. ఈ షాట్ లో నువ్వు లేవు కూడా వెళ్లి విశ్రాంతి తీసుకో అని అన్నాడట.  



అప్పట్లో నిర్మాత, దర్శకుడి మధ్య సంబంధాలు అలా ఉండేవి. మరోసారి గుమ్మడిగారికి కోపం వచ్చింది.  నాకే డైలాగులు ఎలా చెప్పాలో నేర్పుతాడు అంటూ ఓ సినిమా దర్శకుడిపై అంతెత్తున మండిపడ్డాడు.  ఆ సమయంలో అక్కడే ఉన్న కమెడియన్ చలం... మీకే కదండీ నాకు కూడా ఎలా చెప్పాలో నేర్పుతున్నారు అనే సరికి గుమ్మడి కోపం కాస్త తగ్గిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: