టాలీవుడ్ లో ఎంతో మంది సినీ నటులు దర్శకత్వంలోకి అడుగు పెట్టి సత్తా చాటారు. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటులో..అంతే గొప్ప దర్శకులుగా సత్తా చాటారు.  పద్మనాభం, రాజబాబు, భానుమతి, విజయనిర్మల ఇలా ఎంతో మంది నటులుగా రాణిస్తూనే దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.  ఇక కొరియోగ్రాఫర్లుగా కెరీర్ ప్రారంభించిన తర్వతా నటులుగా మారిన ప్రభుదేవ, లారెన్స్ లు సైతం ఇప్పుడు దర్శకులుగా టాప్ పొజీషన్లో ఉన్నారు.  అయితే చాలా అరుదుగా దర్శకత్వం నుంచి నటులుగా మారిన వారు ఉన్నారు. 

తాజాగా ఇదే కొవలోకి వస్తున్నారు..ప్రముఖ మాస్ దర్శకులు వివివినాయక్.  గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలో వివివినాయక్ చిన్న పాత్రలో కనిపించాడు.  ఈ మూవీకి ఆయనే దర్శకుడు కావడం మరో విశేషం. ఈ మద్య వివివినాయక్ బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి.  అఖిల్ తో తీసిన అఖిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది..తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఇంటిలీజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచి ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు.

ఇప్పుడు వివివినాయక్ దర్శకత్వం కన్నా నటుడిగా బెటర్ అనుకున్నారో ఏమో..టాలీవుడ్ లో నటుడిగా తన కొత్త యాత్రం ప్రారంభించబోతున్నారట. ఈ క్ర‌మంలో జిమ్‌లో భారీ వ‌ర్కవుట్స్ కూడా చేస్తున్నాడు. ఇటీవ‌ల వినాయక్ జిమ్‌లో వర్కవుట్ సెషన్‌లో పాల్గొన్న‌ప్పుడు తీసిన ఫొటో ఒకటి వైర‌ల్ అయింది. శరభ ఫేం నరసింహారావు డైరెక్షన్‌లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం కాగా, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.అక్టోబ‌ర్ 9 వినాయ‌క్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజే చిత్ర షూటింగ్ ప్రారంభించాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్క‌నున్న ఈసినిమా కథ 1980ల కాలం నాటికి సంబంధించిన‌దిగా తెలుస్తుంది.  మరి దర్శకుడిగా మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న వివివినాయక్ హీరోగా ఎంత వరకు రాణిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: