బిగ్ బాస్ స్టార్ట్ అయి యాభై రోజులు పూర్తయింది. హౌస్ మెంబర్స్ కి ఒకరికొకరి ఎంతోకొంత బాండింగ్ ఏర్పడింది. ఈ టైంలో వైల్డ్ కార్డ్ అంటూ శిల్పా చక్రవర్తిని తీసుకురావడం హౌస్ మేట్స్ ని షాక్ కి గురి చేసింది. అందుకే శిల్పా చక్రవర్తిని మిగతా హౌస్ మేట్స్ ఒక కంటెస్టెంట్ గా భావించలేదు. అంటీ ముట్టనట్టుగా ప్రవర్తించారు. ఆమె ఏం చేసినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇన్ని రోజుల నుండి మేమున్నాం నువ్విప్పుడే వచ్చావు అన్న రేంజ్ లో వాళ్ళ ప్రవర్తన ఉండింది.


అదీ గాక శిల్పా చక్రవర్తి వస్తూనే బాబా భాస్కర్ ని టార్గెట్ చేసింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని కదిపితే ఆమెకి స్క్రీన్ ప్రెసెన్స్ వస్తుందని ఆమె భావించినప్పటికీ, ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. బాబా భాస్కర్ ని టార్గెట్ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆమెపై వ్యతిరేకత పెరిగింది. కొత్తగా వచ్చిన శిల్పా చక్రవర్తికి ఎక్కడ కూడా తనని తాను ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. అందుకని నాగార్జున గారి దగ్గర తనని ఒంటరి చేశారని చెప్పింది. 


అలా అయిన సింపతీ వర్కవుట్ అవుతుందని ఆమె అనుకుని ఉండవచ్చు. కానీ ఆమె అలా అనడంతో వచ్చిన మొదటి వారంలోనే నామినేషన్ లోకి వెళ్ళిపోయింది. కొత్త కంటెస్టెంట్ కావడంతో ఆమెకి బయట ఫ్యాన్ బేస్ అనేది లేదు. దాంతో ఆమెకి ఓట్లు చాలా తక్కువ వచ్చాయి.  ఈ వారం ఎలిమినేషన్ లో ఐదుగురు ఉన్నారు.  శ్రీముఖి, పునర్నవి, శిల్పా చక్రవర్తి, రాహుల్,హిమజ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది స్పష్టంగా తెలిసిపోయింది.


అందరూ ఊహించినట్టుగా శిల్పా చక్రవర్తి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్తుందని సమాచారం. . మొత్తానికి ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. దీన్ని బట్టి యాభై రోజుల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ కరెక్ట్ కాదనే అర్థం అవుతుంది. శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అవడంలో ఆమె గేమ్ ప్లాన్ ఒక కారణమయితే, రాంగ్ టైంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా మేజర్ కారణంగా చెప్పుకోవాలి. కంటెస్టెంట్ అని చెప్పి వారం రోజుల అతిధిని తీసుకొచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: