టాలీవుడ్ లో శ్రీరెడ్డి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసిన పోరాటం ఉవ్వెత్తున లేచింది. కానీ.. ఆమె చేసిన ఓ పెద్ద తప్పిదం ఆమె ఆశయంపై నీళ్లు జల్లింది. అయినా శ్రీరెడ్డి లేవనెత్తిన సమస్యపై ఇప్పటికీ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరి పోరాటంలో ఇప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె గళమెత్తుతూనే ఉంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

 

 

 

సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ గా చెలామణీ అవుతున్న అక్కినేని ఇంటి కోడలు సమంతపై ఆమె షాకింగ్ కామెంట్ చేసింది. శ్రీరెడ్డి..  తన అఫీషియల్ ఫేస్ బుక్ అక్కౌంట్ లో సమంత ఫోటోను, తన ఫోటోను పోస్ట్ చేసి వివాదానికి ఆద్యం పోసింది. "సమంత సూపర్ స్టార్ కావచ్చు.. కానీ మా ఇద్దరిలో ఎవరు సెక్సీగా ఉన్నారో చెప్పండి" అంటూ పోస్ట్ చేసింది. సమంత రీసెంట్ ఫోటోషూట్ ఫోటోను ఆమె అప్లోడ్ చేసింది. దీంతో నెటీజన్లకు పని చెప్పింది. ఈ పోస్ట్ ఇప్పుడు ట్రోలింగ్ అవుతోంది. నెటిజన్లలో ఎక్కువ శాతం శ్రీరెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. "సమంత ఓ ఇంటి కోడలు.. నువ్వేంటి", "సమంత ఎక్కడ.. నువ్వెక్కడ", "శ్రీరెడ్డి.. నువ్వు సూపర్" అంటూ డిఫరెంట్ గా స్పందిస్తున్నారు.

 

 

 

శ్రీరెడ్డి.. ఒక్క సమంతనే కాదు ఎందరినో టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తుంది. ఇందులో పవన్ కల్యాణ్, రానా, నానీ, ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్, రాఘవ లారెన్స్, అభిరామ్ దగ్గుబాటి.. ఇలా ఎందరో సెలబ్రిటీలను ఆమె టార్గెట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి సమంతను కూడా యాడ్ చేసింది. ఈ పోస్ట్ తో ఈసారి అక్కినేని అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఎందుకు ఈ పోస్ట్ చేసిందో శ్రీరెడ్డికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: