తెలుగు చిత్ర సీమ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక్ ధీరుడు రాజమౌళి. మన తెలుగు సినిమా పరిశ్రమ గురించి బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనే ఒక చరిత్ర సృష్టించారు జక్కన్న. తను ఏ హీరో తో సినిమా చేసిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తీరాల్సిందే. అయితే ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఇద్దరికి సినిమాలో సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. అలా జరగలేదో ఫ్యాన్స్ నుంచి పెద్ద స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు అలాంటి తలనొప్పులే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎదుర్కొంటున్నారని తాజా సమాచరం.

జక్కన్న ఏ సినిమా చేసినా మొదటి నుంచే ఆ సినిమా ప్రమోషన్ ని వినూత్నంగా ప్లాన్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిని.. ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేయడం ఆయన స్ట్రాటజీ. మర్యాద రామన్న నుంచి  రాజమౌళి ఇదే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్నారు. ఈ పద్ధతి క్లిక్కయ్యింది. వరుస బ్లాక్ బస్టర్లను ఆయన సొంతం చేసుకుంటున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీకి ఈ స్ట్రాటజీ ఇండియా లెవల్లో వర్కవుటైంది.

అయితే ఇప్పుడా స్ట్రాటజీని ఫాలో కావాలంటే రాజమౌళికి భయమేస్తోందట. కారణం రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల అభిమానులే. ఈ క్రేజీ స్టార్లతో జక్కన్న 'ఆర్ ఆర్ ఆర్' అనే భారీ మల్టీ స్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలంటే జక్కన్న భయపడుతున్నారట. ఎక్కడ అభిమానులు మా హీరోని తక్కువ చేసి చూపించావంటే మా హీరోని తక్కువ చేసి చూపించావని సోషల్ మీడియా వేదికగా చరణ్ - తారక్ ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తారోనని.. అది సినిమాను ఎక్కడ దెబ్బ తీస్తుందోనని జక్కన్న భయపడుతున్నారట. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలనుకున్నా అభిమానుల కారణంగా జంకుతున్నారట జక్కన్న. ఏదేమైనా సరే పోస్టర్స్ రిలీజ్ చేయాల్సిందే కదా..అందుకు వేరేలా ఏదో ఒక ప్లాన్ చేయాలి కదా. ఇక 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్  రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: