టీవీలో యాంకర్‌గా పరిచయమైన ఓంకార్‌,రియాల్టీషోలు చేసి బాగా పేరు తెచ్చుకున్నాడు.తర్వాత దర్శకుడిగా మారి తొలి సినిమా'జీనియస్‌'తో పెద్ద సినిమా చేసిన పేరూ సంపాదించుకున్నాడు.కాని చివరికి అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో సేఫ్‌సైడ్‌గా హార్రర్‌ ఫార్మెట్‌తో రాజుగారిగది అని సినిమా తీశాడు.అందులో తన తమ్ముడు అశ్విన్‌ ఓంకార్‌ను హీరోగా చూపిస్తూ,మిగిలిన పాడింగ్‌ ఆర్టిస్టులతో తను చేసిన ప్రయోగం సక్సెస్‌ అయ్యింది.చిన్న సినిమాగా విడుదలై,మంచి విజయాన్ని అందుకున్న చిత్రం'రాజుగారి గది'ఓంకార్ జీవితంలో ఎప్పటికి గుర్తుంటుంది.



ఇక దానికి సీక్వెల్‌గా తీసిన ‘రాజుగారి గది 2’లోకి మాత్రం నాగార్జున,సమంత లాంటి పెద్ద స్టార్లను తీసుకొచ్చారు.ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందింది మంచి వసూళ్లను రాబట్టింది.దీంతో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాను ఓంకార్ తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి మిల్కీ బ్యూటీ తమన్నాను,నమ్ముకుని.ఇక‘రాజుగారి గది’హార్రర్ కామెడీ చిత్రాల సిరీస్ లో వస్తున్న మూడవ చిత్రం రాజుగారి గది3.మొదట రెండు చిత్రాలు మంచి విజయం సాధించడంతో దర్శకుడు,మూడవ చిత్రం రాజుగారి గది3 చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు.ఇకపోతే మొదట రెండు చిత్రాలలో పూర్ణ,సమంత నటించగా ఈ మూడవ చిత్రంలో అవికా గౌర్ నటించడం విశేషం.



కాగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసారు.ఒకటిన్నర నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ హారర్ అంశాలతో ఆసక్తికరంగా సాగింది. మొదటి రెండు భాగాలలో హారర్ కి హాస్యం జోడించి తీసిన ఓంకార్ మూడవ భాగంలో కేవలం హారర్ పైనే ఎక్కువ దృష్టి సారించారనిపిస్తుంది..మొదటి రెండు భాగాలలో చేసిన అశ్విన్ బాబు మరో మారు రాజుగారి గది 3 లో హీరోగా చేస్తుండగా,బ్రహ్మజీ,ఊర్వశి,ధన్రాజ్,అజయ్ ఘోష్,అలీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ దర్శకత్వంలో త‌మ‌న్నా ప్రధాన పాత్రలో న‌టిస్తుండ‌గా అశ్విన్ ముఖ్య పాత్రలో నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నహలు చేస్తున్నారు చిత్రయూనిట్..

మరింత సమాచారం తెలుసుకోండి: