యంగ్ హీరో సందీప్ కిషన్ , మినిమమ్  గ్యారెంటీ డైరెక్టర్  నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  చిత్రం తెనాలి రామకృష్ణ.  అవుట్ అండ్ అవుట్  కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి  చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.  ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను  కొద్దీ సేపటి క్రితం  విడుదల చేయగా...  నాగేశ్వర్ రెడ్డి మార్క్ కామెడీ తో  టీజర్ ఎంటర్టైనింగ్ గా వుంది. 



ముఖ్యంగా ఈ టీజర్ లో  కమెడియన్ సప్తగిరి చెప్పిన   'వాడి తల ఎగరాల్సిందే .. గద్దలు క్యాచ్ పట్టాల్సిందే' అనే  డైలాగ్  వైరల్ అవుతుంది. ఈ డైలాగ్ వింటేమనుకు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీను  కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ్ విధేయ రామలోని  చరణ్ విలన్ తల నరికితే  ఆ తల గాల్లోకి ఎగిరి గద్దలు క్యాచ్ పట్టుకునే సీనే గుర్తుకువస్తుంది.   ఈ సీన్ ఫై అప్పట్లో   సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. 



ఇక ఇప్పుడు తెనాలి రామకృష్ణ లో కూడా  సప్తగిరి చెప్పిన ఆ డైలాగ్ కూడా  దానికి సెటైర్ గానే ఉందనే కామెంట్లు వస్తున్నాయి.  ఇటీవల వరుస పరాజయాలను చవి చూసిన సందీప్ కిషన్ ఈచిత్రం ఫై భారీ ఆశలు పెట్టుకున్నాడు.  మరి ఈ చిత్రంతోనైనా  సందీప్ హిట్ కొడతాడో లేదో చూడాలి.  ఈ చిత్రంలో  హన్సిక  హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఎం,మురళి శర్మ , వెన్నల కిషోర్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం  నవంబర్ లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: