హీరో కమలహాసన్ జీవితంలో ఉన్న మలుపులు సంచలనాలు మరి ఏ హీరో జీవితంలోను ఉండవేమో. అటువంటి హీరో జీవితం పై ఒక పుస్తకం వస్తే అది హాట్ టాపిక్ గానే మారుతుంది. ఎందుకంటే, ఆయన వృత్తిజీవితం, వ్యక్తిగత జీవితం రెండూ విచిత్రంగానే ఉంటాయి. వివాహ వ్యవస్థ పై సరైన అభిప్రయంలేని కమల్ రెండు సార్లు పెళ్ళి చేసుకున్నాడు. ప్రస్తుతం గౌతమితో సహజీవనం చేస్తున్నాడు. అటువంటి కమల్‌తో కొన్నేళ్ల పాటు జీవితాన్ని పంచుకున్న ఆయన మాజీ భార్య సారిక స్వయంగా తన మాజీ భర్త జీవిత చరిత్ర రాస్తోంది. అంతేకాదు ఆ జీవిత చరిత్రలో ప్రపంచానికి తెలియని కమలహాసన్ విశేషాలు చెపుతానంటోoది. ఈ వార్త తెలియగానే దేశంలోని ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ లు ఆమె ఇంటి ముందు క్యూ కట్టి ఆ పుస్తకాన్ని ప్రచురించే హక్కు తమకు ఇవ్వమని భారీ మొత్తాలు ఆఫర్ చేస్తున్నాయట. అయితే ఈ విషయం కమల్‌కి ఏమాత్రం రుచించడంలేదట. దీని గురించి తెలిసిన కమల్ ‘‘నా లైఫ్ కాంట్రవర్షియల్ నా అంగీకారం లేకుండా రాసే రాతలు నా పిల్లలను బాధించకూడదనుకుంటున్నాను’’ అని తన ఫ్రెండ్ దగ్గర బాధ పడ్డాడు అని తెలుస్తోంది. ఏదేమైనా తన జీవిత చరిత్రను సారిక రాయడం కమల్‌కి ఇష్టం లేదని అర్థమవుతోంది. ఈ మాటలు ఆ నోటా ఈ నోటా సారికకు చేరి ఉంటాయి. ఇటువంటి పరిస్థుతులలో అభిప్రాయాలను మన్నించి సారిక తన ప్రయతన్నాని విరమించుకుంటుందా లేకుంటే పబ్లిషర్స్ ఆఫర్ చేస్తున్న భారీ మొత్తాలకు ఆశపడి కమల్ లోని వేరే కోణాన్ని ప్రజలకు తెలియ చేస్తుందా అనే విషయం పై కోలీవుడ్ లో ఆశక్తి నెలకొని ఉంది. మరి ఈ విషయంపై కమల్ గారాల కూతురు సృతిహాసన్ ఏమంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: