టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరోగా నటించిన తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ ని అందుకున్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత వరుసగా మంచి విజయాలతో దూసుకుపోయారు. ఆయన నటించిన నాలుగవ సినిమా తొలిప్రేమ, అలానే ఏడవ సినిమా ఖుషి, పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ ఇమేజిని తీసుకురావడంతో పాటుగా యూత్ లో విపరీతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ తీసుకురావడం జరిగింది. ఇక ఇటీవల ఆయన తన కెరీర్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి అనంతరం, సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో మునిగిపోయారు పవన్. 

ఇకపై తన జీవితం అంతా ప్రజాక్షేత్రంలోనే గడపనుండడంతో, పవన్ కు ప్రత్యామ్నాయంగా ఆయన ఫ్యామిలీలో ఎవరున్నారు అనే చర్చ గత కొద్దిరోజలుగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. వారి ఫ్యామిలిలో రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటివారు ఉన్నప్పటికీ, వారు ముగ్గురు ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇటీవల ముకుంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్, తాను నటించిన ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, సినిమాలతో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరున్నర అడుగుల ఎత్తు, ఆకట్టుకునే రూపం, 

అద్భుతమైన నటనతో మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్న వరుణ్, ప్రస్తుతం వాల్మీకి అనే పక్కా మాస్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ సినిమాలే చేసిన వరుణ్, ఈ సినిమాతో పక్కా మాస్ హీరోగా క్రేజ్ సంపాదించడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. అయితే దీని తరువాత మరొక రెండు, మూడు మంచి మాస్ సినిమాల్లో కనుక నటిస్తే, వరుణ్ తన బాబాయి పవర్ స్టార్ మాదిరిగా మంచి క్రేజ్ సంపాదించి ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి వరుణ్ రాబోయే రోజుల్లో మెగా ఫ్యాన్స్ కోరికను ఎంతవరకు తీరుస్తాడో తెలియాలంటే మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: