అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరో.  బన్నీకి ఆల్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు.  తెలుగులో ఎలాంటి డైహార్డ్ ఫాన్స్ ఉన్నారో అటు మలయాళంలో కూడా బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారు.  తెలుగుతో పాటు మలయాళంలో కూడా అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ అవుతాయి. విచిత్రం ఏమిటంటే.. నాపేరు సూర్య సినిమా తెలుగులో ప్లాప్ అయినా.. మలయాళంలో మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  గత సినిమాలు కూడా అక్కడ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.  


ఇక యూట్యూబ్, స్ట్రీమింగ్ కేటగిరీలో అల్లు అర్జున్ కు హిందీలో మంచి మార్కెట్ సొంతం అయ్యింది.  యూట్యూబ్ లో బన్నీ సినిమాలు బాగా చూస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు.  అయితే, స్ట్రీమింగ్ నుంచి థియేటర్స్ వైపు ఆ ప్రేక్షకులను మళ్లించాలని ఆలోచనలో బన్నీ ఉన్నాడు.  తెలుగు, మలయాళంహిందీలో బన్నీకి డిమాండ్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ చేయబోయే సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా చేయాలని అనుకుంటున్నాడట.  


ఐకాన్ సినిమాతో దానికి శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నాడు.  వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయ్యింది.  ఇందులో బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చే విధంగా కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించారట.  ప్రస్తుతం దిల్ రాజు దగ్గర ఉన్న రైటర్స్ టీమ్ ఆ పనిమీదనే ఉన్నట్టు తెలుస్తోంది.  ఎలాగో దిల్ రాజు కూడా హిందీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు.  ప్రస్తుతం జెర్సీ సినిమాను హిందీలో నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నాడు.  


ఐకాన్ సినిమాను కూడా అదే స్థాయిలో నిర్మించాలని అనుకుంటున్నాడు.  అయితే, పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ లో మైలేజ్ ఉండే ఆర్టిస్టులు ఉండాలి.  అందుకోసమే బన్నీ అలియాను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడు.  ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజుకు ఇప్పటికే చెప్పారట. దానికి దిల్ రాజు కూడా ఒకే చెప్పారని సమాచారం.  అలియా ప్రస్తుతం రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ గా చేస్తున్నది.  ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నది కాబట్టి.. బన్నీ సినిమా చేయడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.  కాకపోతే..ప్రస్తుతం అలియా చాలా బిజీగా ఉన్నది. బన్నీతో సినిమాచేయడానికి కుదురుతుందో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: