బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ ఆర్ ఆర్". ఈ సినిమాకి అధికారికంగా ఇంకా పేరు నిర్ణయించనప్పటికీ "ఆర్ ఆర్ ఆర్" అంటేనే జనాలకి అర్థమైపోతుంది. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండి జనాల్లో ఆసక్తి పెరిగింది. రాజమౌళి సినిమా అంటేనే జనాలకి  ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇద్దరు బడా స్టార్స్ తో తీస్తున్న చిత్రం అవడంతో అది మరింతగా పెరిగింది.


అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం లాగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లాగా కనిపిస్తారట. అయితే అభిమానులు ఎన్టీఆర్ ని కొమరం భీం లాగా, రామ్ చరణ్ అల్లూరి లాగా ఎలా ఉంటారో చూద్దామని తహ తహలాడుతున్నారు. రాజమౌళి వారి లుక్ ఏ విధంగా ఉంటుందనేది ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో వీరి లుక్ కి సంబంధించి రకరకాల ఫోటోలు దర్శనమిస్తున్నాయి.


ఇండస్ట్రీలో నెలకొన్న ఆసక్తి కారణంగా వారి లుక్స్ రాజమౌళి ఎలా డిజైన్ చేసుంటాడనే టాపిక్ మొదలైంది. వాస్తవానికి కొమరం భీమ్ కోరమీసం, తలపాగాలో ఉంటారు కాబట్టి, ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ గురించి అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు.కానీ చరణ్ సంగతేంటి?. అల్లూరి సీతారామ రాజు బాగా పెరిగిన గడ్డం మరియు జులపాలతో ఉంటారు. ఒక ప్రక్క ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నా చరణ్ జుట్టు పెంచలేదు.


మరి అల్లూరి గా చరణ్ ని చూపించడానికి జక్కన్న విగ్ ఏమైనా వాడుతాడా లేక, కొమరం భీమ్ లుక్ లానే తలపాగాతో లాగించేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ మనకు తెలియని కొమరం భీం, అల్లూరి క్యారెక్టర్లని చూపించాలని అనుకుంటున్నానని రాజమౌళి చెప్పాడు. దాంతో వీరిద్దరి లుక్ మనం చూడని విధంగా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: