అక్కినేని వారి ఇంటికి కోడలు అయినా గాని పెళ్లి చేసుకున్న గాని అక్కినేని సమంత కి అవకాశాలు ఎక్కడా తగ్గడం లేదు. పెళ్లయ్యాక కూడా సమంత నటించిన చాలా సినిమాలు అద్భుతమైన హిట్ అందుకున్నాయి. అంతేకాకుండా గ్లామర్ విషయంలో ఎక్కడా కూడా వన్నె తగ్గకుండా మెయింటెన్ చేస్తూ తన మార్కెట్ కి నష్టం రాకుండా సినిమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతుంది. ఈ సంవత్సరం భర్త నాగచైతన్యతో 'మజిలీ' తర్వాత 'ఓ బేబీ' సినిమాతో రెండు సూపర్ డూపర్ హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.


పెళ్లి అయినా కానీ సినిమాలు చేయడం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ మరోపక్క ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ చేసే ప్రతి సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతూ సినిమా కి తగిన న్యాయం చేయడానికి సమంత ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో తన అందం యొక్క రహస్యానికి గల కారణం ఏంటో ఇటీవల బయటపెట్టింది. తన అందానికి సీక్రెట్ తన బ్యాగ్ లో ఉంటుందని తెలిపింది. ఎన్ని ప‌నులున్నా… ఎంత బిజీగా ఉన్నా స‌మంత జిమ్‌కు వెళ్ల‌డం ఖాయ‌మ‌ట‌.


ఇక మార్ష‌ల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఆమె ఏ సింబ‌ల్ అయినా అవ‌లీల‌గా చేసేస్తుంద‌ట‌. సినిమా షెడ్యూల్స్ లేక‌పోతే ఎక్కువుగా జిమ్‌లోనే గ‌డిపే స‌మంత‌… తిండి విష‌యంలో మాత్రం చాలా ప్లానింగ్‌తో ఉంటుంద‌ట‌. అన్నం, సాంబార్‌, చికెన్‌, ఫిష్‌, స్వీట్‌ పొంగల్‌తో పాటు ఫిల్టర్‌ కాఫీ, ప్రోటీన్లు ఎక్కువ ఉండే ఆహారం, అధిక నీరు, తాజా కూరగాయలు, కొబ్బరి నీరు డైట్‌లో ఉండేలా చూసుకుంటారు. వీటితో పాటు ఆమె బ్యాగ్‌లోనే ఆమె అందానికి సంబంధించిన కిట్ ఉంద‌ట‌. ఇదే తన అందానికి సీక్రెట్ అని సమంత ఇటీవల చెప్పుకొచ్చింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: