ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫిసు వద్ద బోల్త కొట్టిన సినిమా "సాహో". అయితే ఈ సినిమాకి మొదటి నుండి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. కానీ కొన్ని చోట్ల అనుకున్నంత కలెక్షన్లు రాక్పోవడంతో ఈ సినిమాకు నష్టాలు తప్పలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ లో సాహో కథ ముగిసినట్లే లెక్క. సాహో చాలా చోట్ల భారీ నష్టాలను మిగల్చగా కొన్ని ఏరియాలలో నామమాత్రపు నష్టాలతో బయటపడ్డారు.


ఐతే సౌత్ కి భిన్నంగా సాహో నార్త్ ఇండియా లో సాహో విజయ ఢంకా మోగించింది. ముఖ్యంగా గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో ఈ సినిమా విజయపతాకాన్ని ఎగరవేసింది. సాహో హిందీ వెర్షన్ పూర్తిగా లాభాల బాటలో ఉన్నట్తే అని చెప్పుకోవాలి. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ సాధించి అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది.ఈ వసూళ్ల రీత్యా సాహో క్లియర్ హిట్ గా చెప్పుకోవచ్చు.అలాగే ప్రభాస్ కి ఏమికావాలో అదే సాహో ద్వారా అందింది.


ఎందుకంటే ప్రభాస్ బాహుబలి ద్వార నేషనల్ స్టార్ గా మారిపోయాడు. అందుకే సాహోని ప్రభాస్ ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో అంత డబ్బు పెట్టి తీయగలిగారు. తెలుగులో సాహో విఫలం చెందిన ఆయన క్రేజ్ కి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ హిందీలో నష్టపోతే మాత్రం నష్టం వచ్చేది. బాహుబలి ద్వారా ఆయన సంపాదించుకున్న ఇమేజ్ సాహో విఫలం అయ్యుంటే తగ్గిపోయుండేది.


బాలీవుడ్ లో సాహో విజయం సాధించడంతో ప్రభాస్ కి బాలీవుడ్ లో క్రేజ్ తగ్గలేదని, ఇంకా పెరిగిందనే తెలుస్తుంది. ప్రభాస్ కి సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి మార్కెట్ ఉందని సాహో నిరూపించింది. దీంతో ప్రభాస్ నేషనన్ స్టార్ అనే ట్యాగ్ కి ఎలాంటి ఢోకా లేనట్లే. దీన్ని బట్టి చూస్తే సాహో ద్వారా ప్రభాస్ కి మేలు జరిగినట్లే లెక్క.



మరింత సమాచారం తెలుసుకోండి: