నువ్విలా సినిమాలో ఎదో చిన్న క్యారక్టర్ తో మొదలైన విజయ్ దేవరకొండ సినీ కెరియర్, ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో కొంచం వెలుగులోకి వచ్చాడు. నాని సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించి దూద్ కాశి అంటూ అందరిలో క్రేజీ బాయ్ గా మంచి పేరును సంపాదించాడు. అలా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ జనాలకు దగ్గరైన విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

అలా మొదలైన అయన హీరో జర్నీ ఇప్పుడు ఆయన స్థాయినే మార్చేసింది. పెళ్లిచూపులు సినిమా హిట్ అవ్వడంతో విజయ్ క్రేజ్ బాగా పెరిగింది. ఆ సినిమా తర్వాత ద్వారకా సినిమాలో నటించాడు ఆ సినిమా అతన్ని నిరాశ పరిచింది.  ఇకపోతే అర్జున్ రెడ్డ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా విజయ్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆ సినిమాలో అయన యాక్టింగ్ కు మార్కులు బాగా పడ్డాయి. 

ఆ సినిమా తో విజయ్ దూకుడు మరింతగా పెరిగింది. దానితో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొన్న వచ్చిన అయన సినిమాలు గీతగోవిందం, టాక్సీవాలాచిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. నోటా, డియర్ కామ్రేట్ చిత్రాలు నిరాశనే మిలిచ్చాయి. అలా అయన సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా అయన లవ్ లో ఫెయిల్ అయ్యాడట. విజయ్ ఎప్పుడు ప్రేమలో పడ్డాడు ఎప్పుడు ఫెయిల్ అయ్యాడో అనుకుంటున్నారు కదూ.. అదేనండి కాంత్రి మాధవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. 

ఆ సినిమా విషయానికొస్తే.. ఆ సినిమా టైటిల్ ను ఈరోజు రిలీజ్ చేశారు. బ్రేకప్ అనే టైటిల్ పెట్టారట దర్శకుడు. దానికి వరల్డ్ ఫెమస్ లవర్ ట్యాగ్ కూడా జతచేసారు. రాశికన్నా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా తో పాటుగా మరో ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. లాస్ట్ రెండు సినిమాలు విజయ్ కి ఫ్లాప్ ఇచ్చాయి. ఈ సినిమా అయినా కూడా అతనికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: