మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సైరా' సినిమా అక్టోబర్ రెండవ తారీకున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. దేశవ్యాప్తంగా తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుంటే అందరికీ షాక్ కి గురి చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ఇటువంటి క్రమంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా సైరా డిస్ట్రిబ్యూషన్ లో  ఇన్వాల్వ్ అయ్యారు. సైరా చిత్ర డిస్ట్రిబ్యూషన్ వివరాల్లోకి వెళితే.. నైజాం ఏరియా హక్కులని యువి క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. దిల్ రాజుతో కలసి నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.


నైజాం హక్కులు 30 కోట్లకు అమ్ముడయ్యాయి. సీడెడ్ హక్కులు 20 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇందులో చిత్తూరు ఏరియాలో మాత్రం ఎన్వీ ప్రసాద్, కర్నూలులో కొండూరు మధు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అనంతపూర్ లో సైరా చిత్రాన్ని ఎస్వీ మాక్స్ థియేటర్ ఓనర్ రిలీజ్ చేస్తున్నారు.ఉత్తరాంధ్రలో సైరా హక్కులని క్రాంతి ఫిలిమ్స్ సంస్థ 14.5 కోట్ల రికార్డ్ ధరకు హక్కులని దక్కించుకుంది. ఇక గుంటూరులో సైరా ప్రీరిలీజ్ బిజినెస్ బాహుబలి చిత్రాన్ని మించి పోయింది. గుంటూరు రైట్స్ ని యువి క్రియేషన్స్ సంస్థ 11.5 కోట్లకు దక్కించుకుంది.


ఈస్ట్ గోదావరి హక్కులని విజయలక్ష్మి ఫిలిమ్స్ సంస్థ 9.8 కోట్లకు సైరా హక్కులని సొంతం చేసుకుంది. కృష్ణా ఏరియాలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సైరా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏరియాలో సైరా హక్కుల ధర 7.8 కోట్లు. వెస్ట్ గోదావరిలో ఉషా పిక్చర్స్ 8.3 కోట్లకు, నెల్లూరులో హరి పిక్చర్స్ 4.8 కోట్లకు సైరా హక్కులని సొంతం చేసుకున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సైరా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్  గనుక చూసుకుంటే మొత్తం విలువ 107.9 కోట్లు అని ఫిలిం నగర్ టాక్. ఓవర్సీస్ లో కూడా ప్రముఖ సినిమా సంస్థలు 'సైరా' సినిమా విడుదల హక్కుల్ని దక్కించుకున్నాయి. దాదాపు చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: