మెగాస్టార్ మెగా మూవీ సైరా విడుదల దగ్గరకు వచ్చేసింది. అక్టోబర్ 2 న అంటే గట్టిగా రెండువారాలు మాత్రమే టైముంది. సినిమాకు టాలీవుడ్ లో ప్లాన్డ్ గానే పబ్లిసిటీ జరుగుతోంది. కానీ నాన్ తెలుగు ఏరియాల పరిస్థితి ఏమిటో ఇంకా క్లారిటి రావడం లేదు. ఇదే మెగా ఫ్యాన్స్ ను బాగా కంగారు పెడుతోంది, కలవరపెడుతోంది. పాన్ ఇండియా సినిమా అంటూ భారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఇలా విడుదలైన సినిమాలు బాహుబలి 1, 2, సాహో వున్నాయి. ఇప్పుడు వాటి ముందు సైరా ఏ మాత్రం తీసిపోవడానికి లేదు.

కానీ పరిస్థితి చూస్తుంటే సైరా నాన్ తెలుగు ఏరియాల పబ్లిసిటీని పట్టించుకున్నట్లు అసలు కనిపించడం లేదు. ముఖ్యంగా హిందీలో టఫ్ కాంపిటీషన్ వుంది. హృతిక్ రోషన్ వార్ లాంటి భారీ అంచనాలు వున్న సినిమా వస్తోంది. అలాంటపుడు ఆ సినిమాకి దీటుగా ప్రచారం చేయాలి. పైగా సాహో హిందీ రికార్డు ఎలాగో వుండనే వుంది.ఈ పన్నెండు రోజుల్లోనే ఏం చేసినా చేయాలి. ఇప్పటికి ఒక్కసారి మాత్రమే బాలీవుడ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. బెంగళూరు, చెన్నయ్, కేరళ వెళ్లాలి. వీలైతే ముంబాయి వెళ్లాలి. కానీ ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లో మెగాస్టార్ ఫినిష్ చేయగలరా అన్నది అనుమానంగా ఉంది. 

తెలుగులో కూడా సైరా సినిమా రేంజ్ చూసి మీడియా స్వయంగా ఇస్తున్న పబ్లిటి మాత్రమే తప్ప స్వయంగా సైరా టీం మాత్రం ఇస్తున్నది కాదు. బాహుబలి, సాహో విషయాల్లో కూడా ఇలాగే జరిగింది. మీడియా ఆసక్తి వల్లనే తప్ప, యూనిట్లు పట్టించుకోవడం తక్కువ. ఇక సైరా విషయంలో ఒక్క స్టిల్ కావాలన్నా కూడా మెగాస్టార్ కు తెలియకుండా, చూడకుండా, ఒక్క స్టిల్ వదలడానికి లేదు. చూడడానికి లేదు. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. సాహో విషయంలో కూడా ఇలానే జరిగింది. సినిమా విడుదలకు ముందు ఫ్యాన్స్ కానీ, మీడియా కానీ ఒక్క స్టిల్ అంటే జవాబు వుండేదికాదు. సినిమా విడుదల తరువాత, షేర్లు ఆగిపోయాక, అద్భుతమైన స్టిల్స్, మేకింగ్ వీడియోస్  వరుసగా రిలీజ్ చేశారు. సినిమా మీద ఒక డివైడ్ టాక్ వచ్చాక ఎన్ని చేసినా లాభం ఉండదు కదా..! మరి సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత అయినా ప్రమోషన్స్ ఊపందుకుంటాయా చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: