తెలుగు సినిమా పరిశ్రమ నుండి అనేకమంది నటులు ఇప్పటివరకు రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది. అయితే నటులతో పాటు కొందరు నటీమణులు మరియు మరికొందరు దర్శక నిర్మాతలు కూడా ఈ విధంగా రాజకీయాల్లో చేరిన వారున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన చలసాని అశ్వినీదత్ అతి త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. విజయవాడకు చెందిన అశ్వినిదత్ గతంలో టీడీపీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించారు.

అయితే ఆ తరువాత నుండి టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్న దత్తు గారు, నిన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మరియు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గారు అలానే ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తదితరులను హైదరాబాద్ లోని తన వైజయంతి మూవీస్ కార్యాలయంలో కలిసి కాసేపు చర్చించినట్లు సమాచారం. మొదటగా, వారి అల్లుడు మరియు మహానటి దర్శకుడైన నాగ అశ్విన్ ను, మహానటి సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించినందుకు అభినందించిన బిజెపి నాయకులు, ఆ తరువాత రాజకీయాల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. తనకు మొదటినుండి మోడీ గారి పాలన ఎంతో నచ్చిందని, 

ఆయన ప్రవేశ పెట్టిన పధకాలు మరియు దేశాన్ని ప్రధానిగా ముందుకు తీసుకెళ్తున్న తీరుకు తనకు ఎంతో నచ్చిందని దత్తు గారు వారితో చెప్పనట్లు సమాచారం. అంతేకాక తనకు మళ్ళి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలందించాలనే ఆశ ఉందని, అందువలన అతి త్వరలో తాను బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు తన నిర్ణయాన్ని వారికి తెల్పారట దత్తు గారు. కాగా ఈ వార్త ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే దత్ గారిని బీజేపీ నాయకులు కలిసిన మాట వాస్తవమే కాని, ఆయన బీజేపీ పార్టీలో చేరుతున్నారు అనే దానిపై మాత్రం వారినుండి అధికారిక ప్రకటన రావలసి ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: