తెలిసిన విద్యను ప్రదర్శించడం ఈజీనే. కానీ తెలియని పనిని నేర్చుకొని మరీ పెర్ ఫార్మెన్స్ చేయడం చాలా కష్టం. ఓ బాలీవుడ్ హీరోయిన్ ఈ కష్టమైన పనిని పూర్తి చేసింది. ఈ అమ్మడు చేసిన ఫీట్స్ చూసిన బాలీవుడ్ జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. 


సర్కిల్ ను బ్యాలెన్స్ చేస్తూ.. అటూఇటూ తిప్పడం మాటలు కాదు. కదులుతూ ఉన్న పోల్ పట్టుకొని డ్యాన్స్ చేసేందుకు గట్స్ ఉండాలి. ఇవన్నీ వాణీ కపూర్ లేకపోయినా.. పట్టుదలతో నేర్చుకుంది. ఒకటికి రెండు సార్లు పట్టుదలతో నేర్చుకుంది. ఒకటికి పదిసార్లు పడిలేస్తూ.. ఓ పది రోజుల ప్రాక్టీస్ తర్వాత పర్ ఫెక్ట్ అయింది వాణీ కపూర్. ఆమె కష్టాన్ని "వాణి వర్సెస్ డ్యాన్స్" పేరుతో వీడియో రిలీజ్ చేశారు. 


బాలీవుడ్ స్టార్ డమ్ కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తోంది వాణీ కపూర్. మూడేళ్ల కెరీర్ లో చేసింది మూడు సినిమాలే. డెబ్యూ మూవీ "శుద్ధ్ దేశీ రొమాన్స్"  తర్వాత నటించిన ఆహా కళ్యాణం.. బేఫికర్ నిరాశపరిచాయి. తోటి హీరోయిన్స్ తో పోటీపడలేకపోయిన వాణీకపూర్.. క్రేజీ ఇమేజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న "వార్" లో నటించే ఛాన్స్ అందుకుంది. 


రాకరాక పెద్ద సినిమాలో వచ్చిన ఛాన్స్ కోసం ఫిజికల్ గా చాలా స్ట్రెయిన్ అయింది వాణీ కపూర్. గంగ్రూమ్ సాంగ్ లో పోల్.. విన్యాసాల కోసం.. 10రోజుల పాటు ప్రాక్టీస్ చేసి మరీ నటించింది. ఈ కష్టం ఫలించి వార్ తన కెరీర్ లోనే అదిరిపోయే హిట్ తీసుకొస్తుందన్న గంపెడు ఆశతో ఉంది వాణీకపూర్. వచ్చిన ఛాన్స్ ను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటోంది వాణీ కపూర్. అందుకోసం ఏ పనిచేసేందుకైనా సిద్ధమైపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: