నాని హీరోగా ఇటీవల విడుదలైన సినిమా గ్యాంగ్ లీడర్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన కొత్త హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, టాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించడం జరిగింది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, వెన్నెల కిషోర్, ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ కార్తికేయ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రిలీజ్ అయిన తొలిరోజు తొలిఆట నుండి మంచి హిట్ టాక్ లభించింది. నాచురల్ స్టార్ గా నాని మరొక్కసారి కనబరిచిన సహజ నటన, ఆకట్టుకునే కథ, కథనాలు, రిఫ్రెషింగ్ మ్యూజిక్, అలానే వండర్ఫుల్ విజువల్స్, ప్రేక్షకుడిని కదిలించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా నటి లక్ష్మి గారు, 

నెగటివ్ పాత్రలో నటించిన కార్తికేయ మరియు హీరోయిన్ ప్రియాంక అరుళ్ మహల్ ల పెర్ఫార్మన్స్ వెరసి గ్యాంగ్ లీడర్ సినిమాకు మంచి హిట్ టాక్ ని తీసుకువచ్చాయి. అయితే మొన్నటివరకూ బాగానే కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా, గత రెండు రోజుల నుండి చాలా ప్రాంతాల్లో యావరేజ్ గా మాత్రమే కలెక్షన్స్ రాబట్టడం, ట్రేడ్ విశ్లేషకులను కొంత విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి ఈ సినిమాకు వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని భావించామని, అయితే అనూహ్యంగా రోజురోజుకు సినిమాకు కలెక్షన్స్ తగ్గుముఖం పట్టడం చూస్తుంటే షాకింగ్ గా ఉందని వారు అంటున్నారట. ఇక కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక మరోవైపు యుఎస్ఏ లో కూడా ఈ సినిమా చాలావరకు చతికిల పడ్డట్లు వారు చెప్తున్నారు. మొన్నటి వరకు ఓవర్ ఆల్ గా ఈ సినిమా వన్ మిలియన్ కలెక్షన్ ఖచ్చితంగా దాటేస్తుందని అందరూ భావించారని, 

అయితే అక్కడ ప్రస్తుతం కొంత భిన్నమైన రీతిలో గ్యాంగ్ లీడర్ నడుస్తోందని అంటున్నారు. ఇప్పటివరకు 8 లక్షల 21 వేల డాలర్లు మాత్రమే రాబట్టిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో వన్ మిలియన్ ని అందుకునే పరిస్థితి అక్కడ కనపడడం లేదని అంటున్నారు. సో, మొత్తంగా దీనిని బట్టి చూస్తే, ఫైనల్ గా క్లోజింగ్ సమయానికి గ్యాంగ్ లీడర్, పెట్టుబడిలో మూడొంతులు వరకు మాత్రమే కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందని,  రేపు వాల్మీకి రిలీజ్ అవుతోంది కాబట్టి, ఆ సినిమాకు మంచి టాక్ వస్తే గ్యాంగ్ లీడర్ మరింత తగ్గుతుందని, అదే ఆ సినిమా కాస్త అటు ఇటు అయితే మాత్రం గ్యాంగ్ లీడర్ మరింత పుంజుకునే అవకాశం ఉందని, దానితో దాదాపుగా పెట్టుబడి మొత్తాన్ని రాబట్టినా రాబట్టవచ్చని వారు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో గ్యాంగ్ లీడర్ ఎంతమేర కలెక్షన్ రాబడతాడో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: