మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్  "సైరా నరసింహారెడ్డి" అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముస్తాబు అవుతుంది. ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. సైరా సినిమాను  రామ్ చరణ్ దాదాపు 270  కోట్లతో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన సైరా  ట్రైలర్ లాంచ్ లో రామ్ చరణ్ మరియు దర్శకుడు  సురేంద్రరెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.


సైరా సినిమాను దర్శకత్వం వహించే అవకాశం వచ్చినపుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అన్న రిపోర్టర్ ప్రశ్నకి ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు.ఇలాంటి ఒక సినిమాని  నేను దర్శకత్వం వహిస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమా అవకాశం నా దగ్గరికి వచ్చినపుడు నేను 15 రోజుల సమయం తరువాత నా నిర్ణయం చెబుతాను అని చెప్పాను. వందల కోట్ల డబ్బు, చిరంజీవి గారిని పెట్టి సినిమా చేయగలనా అని అనుకుంటున్నప్పుడు నాకు చిరంజీవి గారు ఎలా కష్టపడి ఇంత ఎత్తుకు ఏదిగారు అన్న విషయం కనబడింది . చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని నా వెనక చరణ్ ఉన్నాడన్న ధైర్యంతో సైరా సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.


ఈ  సినిమా  చేసే ముందు నాకు  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి  తక్కువ తెలుసు. దాదాపు ఆరు నెలలు రీసెర్చ్ చేశాను. పుస్తకాలు చదివి ఆయన గురించి తెలుకున్నాను.పవన్ కల్యాణ్ గారి వాయిస్ సినిమాలో  ఉందా అన్న ప్రశ్నకు నిర్మాత రామ్ చరణ్ సినిమాలో కూడా  పవన్ కల్యాణ్ వాయిస్ ఉంటుందని చెప్పారు.సాడ్ ఎండింగ్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భలు ఎక్కువగా ఉన్నాయి అన్న ప్రశ్నకు దర్శకుడు మాట్లాడుతూ ఇది చరిత్ర ఆధారంగా తీసిన సినిమా.ఆయన మరణంతో ఒక యుద్దానికి తెరలేపాడు ఈ సినిమాకి అదే హైలెట్ అవుతుంది అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: