‘షాక్‌’,‘మిరపకాయ్‌’,‘గబ్బర్‌సింగ్‌’,‘డీజే’లాంటి చిత్రాలతో కమర్షియల్‌ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరీష్‌ శంకర్‌. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట,గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం‘ వాల్మీకి’.పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 20న వరల్డ్‌ వైడ్‌గా విడుదలై అడ్డులేకుండా ముందుకు దూసుకెళ్లుతుంది.‘వాల్మీకి’.సినిమాలో గద్దలకొండ గణేశ్‌గా వరుణ్ రచ్చ రచ్చ చేస్తున్నాడు.ఆనాడు ఆ వాల్మీకి ఒక దొంగ ఆతర్వాత మనిషిగా మారి రామాయణం రాశాడు.మరి ఈ వాల్మీకి ఏం చేస్తున్నాడో తెలుసా సినిమా చూసి తెలుసుకోండి.ఇక తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జిగర్తాండ మూవీనీ, దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేసి వాల్మీకి గా తెరకెక్కించారు......



కాని చివరినిమిషంలో ఈ సినిమాకు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి.వాస్తవానికి మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఇదే టైటిల్‌తో సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది.కానీ, సినిమా టైటిల్‌ను మార్చాలంటూ బోయ,వాల్మీకి సంఘాలు ఆందోళనకు దిగడం..ఆఖరి నిమిషంలో కర్నూలు,అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఈ సినిమా విడుదల ఆపాలని ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో దర్శక,నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు.సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్ మార్చాల్సిరావడం బాధాకరం. అయినప్పటికీ ‘గద్దలకొండ గణేష్’కి వచ్చిన ఇబ్బందేమీ లేదు.



ఫుల్ జోష్‌తో రిలీజైన మొదటి షోతోనే హంగామా సృష్టిస్తూ సక్సెస్ ఫుల్ దిశగా సాగుతుంది.ఇక వరుణ్ లైఫ్‌లో ఇది ఓ బెస్ట్ మూవీగా నిలిచిపోనుందని అభిమానులు చెబుతున్నారు.ఇక యూఎస్‌లో ఇప్పటికే ‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోలు ప్రారంభ మయ్యాయి.అక్కడ సినిమాను చూసిన కొంత మంది సినిమా సూపర్ హిట్,వరుణ్ తేజ్ అయితే ఇరగదీశారంటూ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. గద్దలకొండ గణేష్ పాత్రలో ఆయన నటన, మేనరిజం,డైలాగ్ కమాండ్ అరాచకం అంటున్నారు. హరీష్ శంకర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని కొంతమంది తెగ పోగిడేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: