ఈ సంవత్సరం వెంకటేష్ తో కలిసి సంక్రాంతి బరిలో ‘F2’అంటూ దిగి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా హీరో  ప్రిన్స్ వరుణ్ తేజ్.ఇప్పటి వరకూ కూల్ గా, క్లాస్ గా,లవర్ బాయ్ గా చేసిన పాత్రలన్నిటినీ పక్కన పెట్టి నెగటివ్ షేడ్స్ లో,కంప్లీట్ మాస్ అవతార్ లో చేసిన సినిమా‘గద్దల కొండ గణేష్(వాల్మీకి)’.ఇక మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘జిగర్తాండ’మూవీకి రీమేక్ గా తీసిన ఈ సినిమా నేడు భారి అంచనాల నడుమ విడుదలైంది.



ఇక వరుణ్ తేజ్ ప్రయాణం చూడముచ్చటగా ఉంది.ఒక సినిమాకి మరొక సినిమాకి సంబంధం లేకుండా తను ఎంచుకుంటున్న సినిమాలు తననొక నటుడిగా నిలబెడతా యనడంలో సందేహం లేదు.వాల్మీకి చిత్ర ఒరిజినల్ వెర్షన్ జిగర్తాండలో బాబీ సింహా చేసిన పాత్రను వరుణ్ తేజ్ చేసాడు.అక్కడ అతను చెలరేగిపోయి,జాతీయ స్థాయి అవార్డు కూడా కొట్టేసారు.మరి అలాంటి పాత్రను వరుణ్ తేజ్ ఎన్నుకోవడమే సాహసం.అయితే వరుణ్ ఆ పాత్రకు తన గెటప్ ను మార్చుకున్న తీరుకే హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.చూడగానే ఒక విలన్ ని చూస్తున్నామన్న భావన తీసుకురాగలిగాడు.



ఇక  పూజ హెగ్డే సీన్స్ బాగుండడమే కాకుండా వీరి కెమిస్ట్రీ కూడా అదిరింది.యాక్టింగ్ టీచర్ గా బ్రహ్మాజీ రోల్ సెకండాఫ్ లో హైలైట్ అవుతుంది.తాను ఉన్నంత సేపు బాగా నవ్విస్తాడు. అలాగే కమెడియన్ సత్య కామెడీ కూడా ఫస్ట్ హఫ్‌లో బాగా వర్కౌట్ అయ్యింది.ఇంకా రావు రమేష్,తనికెళ్ళ భరణి,రఘు బాబు,సుప్రియ పథక్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు.ఈ మధ్య అంతగా సినిమాల్లో కనిపించని తనికెళ్ళ,వాల్మీకి సినిమాతో మరో సారి ఆడియన్స్‌ను తన నటన చాతూర్యంతో ఆకట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తనికెళ్ళ భరణి తనకిచ్చిన పాత్రకు పూర్తిగా జీవం పోసాడు....

మరింత సమాచారం తెలుసుకోండి: