వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  సినిమాపై పెట్టుకున్న అంచనాలు దాదాపు నిజం అయ్యాయని చెప్పాలి.  అప్పటి వరకు సాఫ్ట్ పాత్రలు చేసిన వరుణ్ తేజ్ ఒక్కసారిగా మాస్ పాత్రలో కనిపించే సరికి షాక్ అయ్యారు.  కనిపించమే కాదు.. నటన,మేనరిజం అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండటంతో వరుణ్ తేజ్ మాస్ హీరోగా అడుగులు వేయడానికి గద్దలకొండ గణేష్ మూవీ పర్ఫెక్ట్ గా సరిపోతుందని అంటున్నారు.  


ఈరోజు రిలీజైన ఈ సినిమాను చూసిన మెగా అభిమానులు మెగా కుటుంబం నుంచి మరో మాస్ హీరో వచ్చాడని, చరణ్ తరువాత ఆ సత్తా ఉన్న హీరోగా మెప్పిస్తున్నాడని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  ఈ సంబరాలు ఈ సినిమా వరకు ఉంటుందో లేదంటే.. మిగతా సినిమాల విషయంలో కూడా కంటిన్యూ అవుతుందో చూడాలి.  మొత్తానికి మొదటి మాస్ సినిమా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది .  


రామ్ చరణ్ కు రంగస్థలం సినిమా చేయడానికి చాలా సమయం పడితే.. వరుణ్ తేజ్ కు తక్కువ సమయమే పట్టింది.  ఇప్పటి వరకు క్లాస్ కు మాత్రమే సరిపోతారు అనుకున్నారు.  కానీ, మెగాస్టార్ లా మాస్ ను కూడా మెప్పించే సత్తా ఉందని నిరూపించాడు.  బాబాయ్ పవన్ లాగా కొత్త ట్రెండ్ ను సృష్టించే సత్తా ఉందని చెప్పకనే చెప్పాడు వరుణ్.  వరుణ్ ను ఈ విధంగా తీర్చి దిద్దిన హరీష్ శంకర్ కు ముందు థాంక్స్ చెప్పాలి.  


ఎందుకంటే ఇలాంటి మాస్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు మాస్ లో  టచ్ ఉన్న హీరోను తీసుకుంటారు.  అలాంటి హీరో కోసం ప్రయత్నం చేస్తారు.  కానీ, హరీష్ వరుణ్ ఎంచుకోవడం.. హరీష్ నమ్మకాన్ని వరుణ్ నిలబెట్టడంతో సినిమా బంపర్ హిట్ కొట్టింది.  కొన్ని చిన్న చిన్న మైనర్ పాయింట్స్ మినహా మిగతా సినిమా అంతా ఎలాంటి మచ్చలు లేకుండా ఉన్నది.  ముఖ్యంగా వరుణ్ గెటప్.  అదే సినిమాకు ప్లస్ అయ్యింది.  ఇకపై వరుణ్ కూడా స్టార్ హీరోల స్థాయికి ఎదిగి మాస్ సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  వరుణ్ తో రాజమౌళి ఓ సినిమా చేస్తే చాలు.. వరుణ్ ఎక్కడికో వెళ్ళిపోతాడు.  ఎలాగో మెగా హీరో కాబట్టి అది కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: