తెలుగు సినిమా దర్శకుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో టాలెంట్. తెలుగు కథలతోనే సినిమాలు తీసి మెప్పించేవారు కొందరైతే.. రీమేక్ స్పెషలిస్టులు మరికొంతమంది. పర భాషా సినిమాలను మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి రీమేక్ చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక భాషలో తీసిన సినిమా అక్కడి పరిస్థితులకు లోబడి ఉంటుంది. దానిని మనకు రక్తికట్టించేలా సినిమా తీయాలంటే దర్శకులు తమ టాలెంట్ కు పదును పెట్టాల్సిందే. ప్రస్తుతం వాల్మీకితో హరీశ్ శంకర్ ఆ పని చేసే శభాష్ అనిపించుకుంటున్నాడు.


హరీశ్ శంకర్ పేరు వింటే మొదట గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ గురించే. ఆ సినిమాలో పవన్ కల్యాణ్ చూపించిన తీరు అమోఘం. ఫ్యాన్స్ ఏమేం కావాలో అవన్నీ ఓ పవన్ అభిమానిగా ఏర్చి కూర్చి సినిమాను బ్లాక్ బస్టర్ చేసేసాడు. తానూ బ్లాక్ బస్టర్ దర్శకుడనిపించుకున్నాడు. హిందీ దబాంగ్ చూస్తే మన గబ్బర్ సింగ్ లో ఎన్ని మార్పులు చేసి మనల్ని మెప్పించాడో తెలుస్తుంది. దబాంగ్ ను తమిళ్ లో హిందీ స్టోరీ ప్రకారం ఏ మార్పులు లేకుండా తీయడంతో అక్కడ ఫ్లాప్ అయింది. ఇప్పుడు జిగర్తాండ రీమేక్ వాల్మీకిలో గబ్బర్ సింగ్ కు తీసుకున్న జాగ్రత్తలే తీసుకున్నాడు హరీశ్. మెయిన్ పాయింట్ ను తీసుకుని మనకు తగ్గట్టుగా రాసి తీయడంతో ఈరోజు వాల్మీకి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హరీశ్ గత సినిమాల్లో మిస్సైన టెక్నిక్స్ ను ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఉపయోగించి తన మ్యాజిక్ చూపించాడు. మొత్తానికి హరీశ్ శంకర్ రెండు రీమేక్స్ తో మెగా హీరోలకు మంచి హిట్ ఇచ్చాడు.


నేటివిటీల్లో మార్పులు లేకపోతే సినిమా రిసల్ట్ లో తేడా వచ్చేస్తుంది. చిరంజీవి స్నేహం కోసం సినిమా హిట్ అయినా సినిమా ఆసాంతం తమిళ నేటివిటీతో తీసాడు దర్శకుడు. మనకు తగ్గట్టు తీసుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యుండేది. నాగచైతన్య ఏం మాయ చేసావే.. తెలుగులో హ్యాపీ ఎండింగ్ ఉంటే.. తమిళ్ లో సాడ్ ఎండింగ్ ఉంటుంది. రెండూ హిట్ అయ్యాయి. రీమేక్ చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా హిట్ అవుతుందో హరీశ్ ఆ టెక్నిక్ పట్టేసినట్టే ఉన్నాడు.. మొత్తానికి.

మరింత సమాచారం తెలుసుకోండి: