వరుణ్ తేజ్ సినిమా వాల్మీకి టైటిల్ ని నిన్న హై కోర్ట్ ఉత్తర్వుల మేరకు సినిమా నిర్మాతలు మార్పు చేసి, గద్దలకొండ గణేష్ గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందు ఈ విధంగా టైటిల్ మార్చవలసి రావడంతో, దానివలన తమ సినిమాకు కొంతమేర నష్టం చేకూరుతుందని దర్శక, నిర్మతలు కొంత లోలోపల ఆందోళన పడ్డారు. అయితే, వాటిన్నిటినీ పటాపంచలు చేస్తూ, సినిమాలో మంచి కంటెంట్ ఉంటె అటువంటి సినిమాలను ఎవరూ కూడా ఆపలేరు అనే విధంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా, సూపర్ హిట్ టాక్ ని సంపాదించి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోంది. 

వరుణ్ తేజ్ తొలిసారి తన కెరీర్ లో గద్దలకొండ గణేష్ అనే ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి, చాలా రోజుల నుండి తన ఫ్యాన్స్ ఏమి కోరుకుంటున్నారో అది ఇచ్చి వారిని పూర్తిగా సంతృప్తి పరిచారు అని తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా పై ట్రైలర్ రిలీజ్ తరువాత అంచనాలు కూడా బాగా పెరగడంతో, ఎంతవరకు ఈ సినిమా సక్సెస్ సాదిస్తుందో అని కొందరు భావించారు. అయితే ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా నేడు రిలీజ్ అయిన సినిమా, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా నిలిచి ప్రేక్షకుల మన్ననలు పొందింది. హీరో వరుణ్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసారని, కొన్ని సీన్స్ లో ఆయన్ను చూస్తుంటే, 

గతంలో ప్రాణం ఖరీదు సినిమాలో నటించిన మెగాస్టార్ వలే ఉన్నారని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు. ఇక హీరోయిన్ పూజ హెగ్డే, శ్రీదేవి అనే క్యారెక్టర్ లో ఎంతో ఒదిగిపోయి నటించిందని, అలానే తనికెళ్ళ భరణి పాత్ర చాలా బాగుందని చెప్తున్నారు. ఇకపోతే కామెడీ పరంగా బ్రహ్మాజీ, సత్య వంటి వారు మంచి ఫన్నీ సీన్స్ తో ఆకట్టుకున్నారని, ఇక హరీష్  శంకర్ మార్క్ మాస్ సీన్స్ మరియు డైలాగ్స్ అయితే మరింత సూపర్బ్ గా ఉన్నాయని అంటున్నారు. సినిమాకు ఆయనంక బోస్ అందించిన ఫోటోగ్రఫీ, అలానే మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణంగా నిలిచాయట. మొత్తంగా తొలిరోజే మంచి హిట్ టాక్ తెచ్చుసుకున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ఎంతమేర కలెక్షన్ సాధిస్తుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: