బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దబాంగ్ 3 ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను  జరుపుకుంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క టీజర్ ను అక్టోబర్ 1న విడుదలచేయనున్నారని సమాచారం. 90 సెకండ్ల నిడివి తో ఈటీజర్ ప్రేక్షకులముందుకు రానుంది. అక్టోబర్ 2 న హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న వార్ విడుదలకానున్నడంతో ఆచిత్రానికి ఈ టీజర్ ను జత చేసి ప్రదర్శించనున్నారు. భారీ స్థాయిలో విడుదలకానున్న వార్ ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈచిత్రాన్ని తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నాడు సల్మాన్ ఖాన్.  ఇక దబాంగ్ 3 ట్రైలర్ ను దీపావళి కానుకగా అక్టోబర్  25న  విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆసమయంలో  హౌస్ ఫుల్ 4 విడుదలకానుంది. ఆ చిత్రానికి  ఈ ట్రైలర్ ను జోడించి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. మొత్తానికి  ప్రమోషన్స్ విషయంలో పెద్ద మాస్టర్ ప్లానే వేశాడు సల్మాన్ ఖాన్. 






ప్రముఖ  కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్  ప్రభుదేవా తెరకెక్కిస్తున్న  ఈచిత్రంలో  సోనాక్షి సిన్హా  హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్  నటుడు మహేష్ మంజ్రేకర్ చిన్న  కుమార్తె  సయి కీలక పాత్రలో నటిస్తుంది.  వీరితో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సూపర్ హిట్ సిరీస్ దబాంగ్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంఫై  భారీ అంచనాలు వున్నాయి. సాజిద్ -వాజిద్  సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని  సల్మాన్ ఖాన్ , అర్బాజ్ ఖాన్  నిర్మిస్తున్నారు . క్రిస్మస్ కానుకగా  డిసెంబర్ 20న ఈ చిత్రం హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో కూడా విడుదలకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: