టాలీవుడ్ లో పునాధిరాళ్లు సినిమాతో ఓ యువకుడు గుంపులో గోవిందంలా కనిపించాడు..ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలు సైతం చేశాడు..తనపై నెగిటీవ్ షేడ్స్ పడుతున్న సమయంలోనే హిరోగా మారాడు..అప్పటి వరకు టాలీవుడ్ లో కనీ వినీ ఎరుగని రితీలో డ్యాన్స్, ఫైట్స్ లో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్,ఏఎన్ఆర్,శోభన్ బాబు, కృష్ణ లాంటి వారు ఇండస్ట్రీని ఏలుతున్నారు..అలాంటి వారికి పోటీగా నిలబడి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకొని..చిరంజీవి సినిమా అంటే తప్పకుండా చూడాల్సిందే అనే స్థాయికి తీసుకువచ్చారు మెగాస్టార్.
టాలీవుడ్ లో మైకేల్ జాక్సన్, బ్రూస్ లీ అని పేరు తెచ్చుకున్నారు చిరంజీవి. ఆయన నటించిన సినిమాలను ఇప్పటి యువ హీరోలు ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఆయన వారసులుగా ఇప్పటికే ఎంతో మంది హీరోలు తెలుగు సినీ పరిశ్రమంలో తమ సత్తా చాటుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న మరో హీరో పవన్ కళ్యాన్. ఆయన తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ లు మాస్ ఇమేజ్ తో దుమ్మురేపుతున్నారు. ఈ యువ హీరోల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరున్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.
మెగాస్టార్ మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ముకుందా సినిమా తర్వాత వరుణ్ తేజ్ ‘కంచె’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవి మంచి సక్సెస్ అయ్యింది. ఈ రెండు మూవీస్ లో వరుణ్ తేజ్ చాలా క్యూట్ గా అమాయకంగా కనిపించాడు. ఇక పూరి దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో మాస్ లుక్ తో కనిపించాడు. ఆ తర్వాత మరోసారి లవ్ స్టోరీస్ ఫిదా, తొలిప్రేమ లాంటి సినిమాలతో మంచి విజయం అందుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన మాస్ మూవీ లో నటించాలని..తన పెదనాన్న, బాబాయి లా మాస్ ఇమేజ్ సంపాదించుకోవాలని వరుణ్ తేజ్ తెగ తాపత్రయపడుతున్న సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలగొండ గణేష్’(వాల్మీకి) మూవీతో అభిమానుల ముందుకు వచ్చాడు.
14 రీల్స్ ప్లస్ పతాకంపై డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ మొదట వాల్మీకి అని పేరు ఉన్నా..కొన్ని కారణాల వల్ల నిన్న టైటిల్ మార్చి ‘గద్దలకొండ గణేష్’ గా రిలీజ్ చేశారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా నెగిటీవ్ షేడ్స్ లో బాగా అలరించాడు. మొత్తానికి ఈ మెగా కుర్రోడు కూడా మెగా సీనియర్స్ లైన్లోకి వచ్చినట్టే అని మెగా అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు.