పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అంటూ తీసి బాక్సాఫీస్ బద్ధలు కొట్టేలా చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. దబాంగ్ రీమేక్ గా వచ్చిన ఆ సినిమా పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కు సూపర్ హిట్ ఇచ్చింది. ఆ సినిమాతోనే పవర్ స్టార్ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఆ సినిమాతోనే హరీష్ శంకర్ స్టార్ డైరక్టర్ గా మారాడు.


ఇక ఇప్పుడు మళ్లీ గద్దలకొండ గణేష్ తో మరోసారి సత్తా చాటాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కు హిట్ ఇచ్చిన డైరక్టర్ ఇప్పుడు వరుణ్ తేజ్ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడని చెప్పొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా గబ్బర్ సింగ్ అనగానే ఫ్యాన్స్ లో వచ్చే ఉత్సాహమే వేరు.


సేమ్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ ఎలాగో వరుణ్ తేజ్ ఇప్పటివరకు చేసినవి ఇక మీదట ఎన్ని సినిమాలు చేసినా సరే గద్దలకొండ గణేష్ మాత్రం కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు. గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ నటనకు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రెగ్యులర్ సినిమాల్లో ఎలాగోలా చెయొచ్చు కాని గద్దలకొండ గణేష్ లాంటి పాత్రల్లో మెప్పించాలంటే కొంత హార్డ్ వర్క్ చేయాలి.    


నటుడిగా వరుణ్ తేజ్ ఈ పాత్రలో మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. ఇప్పటివరకు కెరియర్ లో చేసిన పాత్రలన్ని క్లాస్ గా ఉండటం ఈ పాత్ర ఊర మాస్ గా చూపించడంతో పాత్రలో వరుణ్ చాలా కొత్తగా అనిపించాడు. లుక్, ఫైట్స్, యాక్షన్, ఎమోషన్ అన్నిటిలో మిగతా మెగా హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా వరుణ్ తేజ్ నటన ఉంది. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాతో వరుణ్ తేజ్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: