మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ సినిమా వాల్మీకి పేరును నిన్న రాత్రి సడన్ గా గద్దలకొండ గణేష్ గా మార్చిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఉత్తర్వుల మేరకు తమ సినిమాకు పేరు మారుస్తున్నట్లు తెలిపింది యూనిట్. ఇకపోతే గద్దలకొండ గణేష్ గా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా, ఆ అంచనాలు అందుకుని సూపర్ హిట్ టాక్ ని సంపాదించింది. వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ మురళి ఒక ముఖ్యపాత్రలో నటించగా, 

ఆయనకు జోడిగా తమిళ నటి మృణాళిని రవి నటించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాని తక ఆకట్టుకునే మాస్ పెర్ఫార్మన్స్ తో ముందుకు నడిపిన వరుణ్ తేజ్ కు మెజారిటీ మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు. ఆ తరువాత దర్శకుడు హరీష్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పాలని, కొన్ని చోట్ల సినిమా కాస్త డౌన్ అయినపుడు, ఆ వెంటనే ఆకట్టుకునే సన్నివేశాలు పెట్టి ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించి హరీష్ మంచి మార్కులు సంపాదించారని అంటున్నారు. ఇక హీరోయిన్ పూజ హెగ్డే సినిమాకు మరింత ప్లస్ అయిందని, ఇకపోతే యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ గా ఉన్నాయని చెప్తున్నారు. 

ఇక వెల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ కు థియేటర్లలో ఫ్యాన్స్, తమ ఈలలు గోలలతో అరుపులు పుట్టిస్తున్నారని తెలుస్తోంది. ఎప్పటినుండో వరుణ్ నుండి మంచి మాస్ సినిమాని ఆశిస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా మంచి ట్రీట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. సినిమాలో విజువల్స్ బాగున్నాయని, ఆయనంక బోస్ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ కూడా సినిమాకు పెద్ద అసెట్ అని అంటున్నారు. ఓవర్ ఆల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేష్, అదరహో అనేలా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్ ల వండర్ఫుల్ మ్యాజిక్ తో సూపర్ హిట్ టాక్ అందుకుని ముందుకు సాగుతున్నాడు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: