మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా టైటిల్ వివాదం నుంచి గట్టెక్కింది. వాల్మీకి నుంచి గద్దలకొండ గణేశ్ గా టైటిల్ ను మార్చారు. అయితే ఈ టైటిల్ మార్పు వెనుక పెద్ద కసరత్తే జరిగిందంటున్నారు. దీనిపై వైసీపీ అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కలిసి మాట్లాడారని సమాచారం.

 

 

 

దీనిపై ఓ చానెల్ తో ఎంపీ రంగయ్య మాట్లాడుతూ “వాల్మీకి వల్లే రామాయణం మనకు దైవం అయింది. అటువంటి పేరును ఫ్యాక్షన్ మూలాలతో తీస్తున్న సినిమాకు ఎలా పెడతారనేదానిపై మాకు అభ్యంతరాలున్నాయి. మొత్తానికి సినిమా టైటిల్ ను వాల్మీకి నుంచి గద్దలకొండ గణేశ్ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నాం. మాకు ఎవరిపైనా శత్రుత్వం లేదు” అని అన్నారు. టైటిల్ లో ఉన్న గన్ మార్చాలంటూ మొదలైన వివాదం మొత్తంగా టైటిల్ నే మార్చాలనే వరకూ వచ్చింది. వాల్మీకి, బోయ సంఘాలు దీనిపై ధర్నాలు కూడా చేశారు, కోర్టుకు కూడా వెళ్లారు. దీనిపై దాఖలైన పిటీషన్ ను హైకోర్టు  బెంచ్ కొట్టేసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న నిర్మాతలకు కర్నూలు, అనంతపురంలో సినిమా విడుదలవ్వటం లేదని వార్తలు రావడంతో అప్పటికప్పుడు సినిమా టైటిల్ మార్చారు.

 

 

 

నిజానికి ఓ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందితే రిలీజ్ కు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు అని సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంది. కానీ ఈ నిబంధనను దాటి పలు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మొన్నామధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదంలోనూ ఇదే జరిగింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందినా ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. గద్దలకొండ గణేశ్ గా టైటిల్ మార్చుకున్న వాల్మీకి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: