నట సింహం  నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం  కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా  ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్  హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో  బాలయ్య పై కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.  వచ్చే నెలలో దసరా కానుకగా అక్టోబర్ 8న  ఈ సినిమా  టీజర్ ను విడుదల చేయనున్నారు.  ఈ టీజర్ కి సంబంధించిన డబ్బింగ్ నిన్న  శబ్ధాలయ స్టూడియోస్‌ లో మొదలైంది.  బాలకృష్ణ  తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు.  ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్ ల్లో కనిపించనున్నారు.  రెండో గెటప్ లో బాలయ్య ఇంకా యంగ్ లుక్ లో కనిపించనున్నారని.. ఈ లుక్స్ కోసం బాలయ్య రోజుకి ఐదు గంటలు వ్యాయామం చేస్తున్నారని తెలుస్తోంది.  ఈ వయసులో కూడా  బాలయ్య ఆ రేంజ్ లో  కష్టపడటం నిజంగా గ్రేటే. ఇక ఇటీవ‌లే  విడుద‌లైన బాలయ్య ఫస్ట్ లుక్‌ కి  ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మరి రెండో లుక్ కి ఇక ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో  చూడాలి.  ఇక ఇటివలే ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన  రెండు పోస్ట‌ర్స్‌  సోషల్ మీడియాలో  బాగా వైరల్ అయ్యాయి. కాగా ఈ సినిమా టైటిల్ గురించి  'రాయల్  సింహా' అని పెట్టబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దర్శకనిర్మాతలు కూడా  ఈ సినిమాకి ఇదే  టైటిల్ పెట్టాలని  ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలయ్య మళ్లీ  సింహా సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడు.  అయితే ఈ  టైటిల్ కి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  


 ఇక ఈ చిత్రంలో  రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలయ్య సరసన  సోనాల్ చౌహాన్ అండ్  వేదిక  హీరోయిన్లుగా  నటించనున్నారు.  అయితే  వేదిక  మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.  అలాగే ఓ కీలకమైన పాత్రలో  నమితను కనిపించనుంది.  నమితది  నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర..  ముఖ్యంగా సినిమాలో  బాలయ్యకి విలన్ గా  కనిపించనుంది.  ఇప్పటికే  సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.  ఇక  ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు  పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడు.  బ్లాక్‌బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొందుతుంది.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.  `జైసింహా` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొంద‌నున్న చిత్ర‌మిది.  అలాగే ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. మరి  ఈ రెండు టైటిల్స్ లో  ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారో చూడాలి.  ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: