మెగాస్టార్ చిరంజీవి మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న సరికొత్త సినిమా సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాక, పలు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. దాదాపుగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు నిర్మాత రామ్ చరణ్. ఇప్పటికే ఆయా భాషల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎంతో అద్భుతంగా జరిగినట్లు సమాచారం. 

ఇక ఇటీవల యూట్యూబ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, వీక్షకులను ఎంతో ఆకట్టుకుని, త్వరలో రిలీజ్ కాబోయే సినిమా పై అమాంతం అంచనాలు పెంచేయడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడుపోగా, ప్రస్తుతం మెగా రికార్డులకు అడ్డా అయిన నైజాంలో మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే కొందరు సినిమా వర్గాల వారి నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఇప్పటివరకు ఈ సినిమాకు ఒక బడా టాలీవుడ్ నిర్మాత రూ.35 కోట్లవరకు ఇవ్వడానికి ముందుకు వచ్చారని, 

అయితే అనూహ్యంగా అంతకు మించి రూ.40 కోట్ల వరకు కూడా చెల్లించి సినిమాను దక్కించుకునేందుకు మరికొందరు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినపడుతోంది. మరి దీన్నిబట్టి చూస్తే, ఇది నైజాంలో ఇటీవల అతిపెద్ద రికార్డు ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాల్లో ఒకటిగా నిలవనుంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఒకవేళ రూ.40 కోట్లకు కనుక ఈ సినిమా అమ్ముడైతే మాత్రం, సినిమాకు మంచి టాక్ రావలసి ఉంటుందని, అప్పుడే కొన్న బయ్యర్లు సేఫ్ అవ్వగలరని అంటున్నారు. మరొక పదిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుని అటు ఫ్యాన్స్ ని, ఇటు బయ్యర్లని ఖుషి చేస్తుందో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: