నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు అయిన ఎన్. శివప్రసాద్ కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. ప్రేమతపస్సు వంటి సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా ఆయన హీరోయిన్ రోజాకు లైఫ్ ఇచ్చారు. ఆ సినిమాతోనే రోజా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.


ఇక డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ నటించిన చివరి చిత్రం 'సాప్ట్ వేర్ సుధీర్'. ఈ సినిమాలో హీరో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్. డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ కన్నుమూసిన నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ ఆయన్ను స్మరించుకుంది.


చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ - 'డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ గారు మా చిత్రంలో మంత్రిగా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఆయన మరణం మాకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అన్నారు.


సుడిగాలి సుధీర్‌,ధన్యా బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌ పై కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా శివప్రసాద్ చివరి సినిమాగా మిగిలిపోనుంది.


అయితే శివప్రసాద్ చివరి సినిమాతోనూ రోజాకు సంబంధం ఉంది. సుడిగాలి సుధీర్ వంటి ఎందరో నటులకు పుట్టినిల్లుగా ఈటీవీ ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగామ్ సక్సస్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ కు యాంకర్ రోజా అన్న సంగతి తెలిసిందే. అలా సుడిగాలి సుధీర్ వంటి నటులు రోజా, నాగబాబులకు చాలా క్లోజ్. ఎందరో సుడిగాలి సుధీర్ వంటి నటులను ప్రోత్సహిస్తూ రోజా.. ఇప్పటికీ సినీరంగంలో తన ముద్ర చాటుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: