తమిళ హీరోనే అయినా తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న నటుడు సూర్య రాను రాను తన తెలుగు మార్కెట్ పై పట్టుకోల్పోతున్నాడని చెప్పొచ్చు. గజిని సినిమాలో సూర్యని చూసి అతన్ని డైరెక్ట్ గా స్టార్ ను చేశారు తెలుగు ఆడియెన్స్. కోలీవుడ్ స్టార్ హీరోలు రజినికాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో ఆ రేంజ్ మార్కెట్ అందుకున్న ఒకేఒక్క హీరో సూర్య. 


అయితే తెలుగులో వచ్చిన తన క్రేజ్ కు తగినట్టు సినిమాలను అందించడంలో విఫలమవుతున్నాడు సూర్య. ఒకప్పుడు తమిళ సినిమాల్లో కొత్తదనం ఉండేది కాని ఇప్పుడు అక్కడ సినిమాలు రొటీన్ సబ్జెక్టులతో వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో స్టార్స్ కూడా ప్రయోగాలు చేయడం వల్ల మన ఆడియెన్స్ ఆలోచించే విధానం కూడా మారింది. 


తెలుగు ఆడియెన్స్ కొత్తదనానికి పెద్ద పీఠ వేస్తున్నారు. అందుకే అరవ సినిమాలు మన ఆడియెన్స్ కు ఎక్కట్లేదు. ఈమధ్య రజిని సినిమాలు కూడా తెలుగు బాక్సాఫీస్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే సూర్య తన ప్రతి సినిమా తెలుగులోకి తెచ్చే ప్రయత్నాలైతే చేస్తున్నాడు కాని వాటితో హిట్టు కొట్టలేకపోతున్నాడు. 


మొన్నమధ్య ఎన్.జి.కే అంటూ వచ్చి నిరాశపరచిన సూర్య రీసెంట్ గా బందోబస్త్ అంటూ వచ్చి మరోసారి ఫెయిల్యూర్ అందుకున్నాడు. కె.వి ఆనంద్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళంలో కాపాన్ గా రిలీజై అక్కడ యావరేజ్ టాక్ తెచ్చుకుంది సూర్య సినిమా. అయితే తెలుగులో మొదటి రోజు కనీసం కోటి కూడా కలక్షన్స్ రాకపోవడం ఆశ్చర్యకరం. బందోబస్త్ కొన్ని తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టపోయేలా ఉన్నారు. సినిమా రిలీజ్ కు రెండు రోజులు వచ్చి ఓ ఈవెంట్ చేస్తే ప్రేక్షకులు ఎలా వస్తారు. సినిమా మీద వారికి ఓ అవగాహన వచ్చేలా ప్రమోషన్స్ చేయాలి. మరి అదికూడా ఎందుకు అనుకున్నారో ఏమో కాని గజిని సూర్య తెలుగు మార్కెట్ దారుణంగా పడిపోయిందని మాత్రం లెక్కలు చూస్తే తెలుస్తుంది.    
 



మరింత సమాచారం తెలుసుకోండి: