నేడు 'డాటర్స్‌ డే' సందర్బంగా  టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాన కూతురు సితారపై  ట్వీట్ చేశారు.  ‘నా బుజ్జి సితా పాపా నీకు ‘డాటర్స్‌ డే’ శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ తానప్రేమను తెలిపారు. నువ్వు చాలా అద్భుతమైన, ప్రియమైన, అల్లరి కుతూరివి నాకు. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను.’ అని మహేష్ తన ట్వీట్‌లో తెలిపారు. అంతేకాదు కూతురు సితారతో దిగిన ఫోటోలన్నీ కలిపి ఒక  వీడియో తీసి పోస్టులో కూడా పెట్టారు.

మహేష్ తాన కూతురుతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. మహేష్ సతీమణి నమ్రత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సితారకు డాటర్స్ డే విషెస్  తెలియచేసారు. నమ్రత  కూడా ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేస్తూ.. సితారకు ‘డాటర్స్‌ డే’ శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో వెలుగు దివ్వెవు నువ్వు. నా ఆకాశంలో ప్రతిక్షణం మెరుస్తుండే చిన్ని తారవు నువ్వు. నా ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా మార్చావు.

లవ్‌ యూ సితార.’అంటూ నమ్రత  కూడా పోస్ట్ చేశారు.మహేష్, నమ్రత ఇద్దరు కూడా తాన కూతురు పై ఉన్న ప్రేమని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.నువ్వు ఎపుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను అని తల్లి తండ్రులు ఇద్దరుట్వీట్, ఇంస్టాగ్రామ్ ని వేదికగా చేసుకుని విషెస్ తెలియచేసారు.ఇప్పటికే మహేష్  ట్వీట్ చేసిన వీడియో ని 70 .5k  మంది వీక్షించారు.25K  మంది వీడియో ని లైక్ చేసారు.

నమ్రత  ఇన్‌స్టాగ్రామ్లో  పోస్ట్ చేసిన వీడియోని కూడా ఇప్పటికే 124,704 వీక్షించారు.వీడియో చాలా బాగున్నాయి అంటూ అభిమానులు కామెంట్స్ రూపంలో విషెస్ తెలియచేసారు.


    మరింత సమాచారం తెలుసుకోండి: