చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. చిన్నా పెద్దా హీరోలు అనే తేడా లేకుండా అంద‌రికీ సామాజిక న్యాయం చేస్తుంది త‌మ‌న్నా. ఈ మ‌ధ్య విడుద‌లైన 'ఎఫ్2' సినిమాలో కూడా ఫుల్లుగా అందాలు ఆర‌బోసింది. ఓ అడుగు ముందుకేసి ఏకంగా బికినీ కూడా వేసి సెగ‌లు పుట్టించింది త‌మ‌న్నా. కెరీర్ మొద‌ట్లో కొన్ని రోజులు మాత్ర‌మే ఇలా గ్లామ‌ర్ షో చేయ‌లేదు త‌మ‌న్నా. కానీ బ‌ద్రీనాథ్ సినిమా నుంచి ఎక్స్‌పోజింగ్‌కు కొత్త అర్థాన్ని చెప్పింది ఈ పాల‌రాతి బొమ్మ‌. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ప్ర‌తీ సినిమాలో రెచ్చిపోతూనే ఉంది.  ప్ర‌స్తుతం సైరాతో పాటు క్వీన్ రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమాల్లో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల్లోనే న‌టిస్తుంది త‌మ‌న్నా.


 ఇదిలా ఉంటే మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించే చిత్రం కోసం తమన్నాను నాయికగా తీసుకున్నట్టు తాజా సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. స‌మంత‌తో `యూ ట‌ర్న్‌` చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. హీరో గోపీచంద్‌తో త‌మ‌న్నా తొలిసారి న‌టిస్తున్న చిత్ర‌మిదే. అలాగే సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌న్నా న‌టించ‌బోయే రెండో చిత్ర‌మిది. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌న్నా ఇది వ‌ర‌కు `బెంగాల్ టైగ‌ర్` చిత్రంలో న‌టించింది. అక్టోబ‌ర్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: