విలక్షణ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే నటుడు సూర్య. ఆయన కళ్ళలో ఉండే ఇంటెన్సిటీ సూర్యకి చాలా ప్లస్ అని చెప్పాలి. తమిళంలో  స్టార్ ఇమేజ్ సాధించుకున్న సూర్య సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. మొట్ట మొదటగా తెలుగులో విడుదలైన "గజిని"చిత్రం రికార్డు వసూళ్ళను సాధించడంతో పాటు తెలుగులో సూర్యకి అభిమానగణాన్ని కూడా ఏర్పరిచింది. ఆ సినిమా తర్వత తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తున్నారు.


తెలుగులో డైరెక్టుగా సినిమాలు చేయనప్పటికీ ఆయనకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రజనీ కాంత్ ని మినహాయిస్తే తమిళ హీరోలలో తెలుగులో ఆ స్థాయి ఇమేజ్ సూర్యకే ఉంది. అయితే గత కొంత కాలంగా సూర్య నుండి ఒక్క హిట్ కూడా రాలేదు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వరుస పరాజయాలు రావడంతో తెలుగులో ఆయన మార్కెట్ చాలా వరకు తగ్గింఅనే చెప్పాలి. ఈ మధ్య రిలీజైన "బందో బస్త్"నే చూసుకుంటే కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి.


ఈ సినిమా కి కనీసం ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాలేదు. ఇదే కాదు గత రెండు, మూడు సినిమాల నుండి పరిస్థితి అలాగే ఉంది. అంత స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత శుక్రవారం విడుదలైన ఆయన కొత్త చిత్రం ‘బందోబస్త్’ అతి తక్కువ ఓపెనింగ్స్ మాత్రమే తెచ్చుకుంది. ఈ ఓపెనింగ్స్ ఆయన గత చిత్రం ‘ఎన్.జీ.కె’ కంటే తక్కువేనట.


మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల లోపే గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు బాగా తక్కువ కలెక్షన్లను రాబట్టుకుంది. మొత్తంగా రెండు రోజులకు కలిపి గ్రాస్ రూ.3 కోట్ల లోపే ఉందట. దీన్ని బట్టి తెలుగులో సూర్య మార్కెట్ బాగా పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే బయ్యర్లు నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి సూర్య తెలుగులో తన మార్కెట్ పెంచుకోవడానికి ఏదైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడేమో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: