తమిళ సూపర్ స్టార్ సూర్యకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి పేరు ఉంది. కెరీర్ తొలినాళ్లలో ఆయన నటించిన గజినీ సినిమా, టాలీవుడ్ లో అతిపెద్ద విజయాన్ని అందుకుని సూర్యకు ఇక్కడ నటుడిగా మంచి క్రేజ్ మరియు మార్కెట్ ని తీసుకువచ్చింది. ఇక అక్కడినుండి ఆయన సినిమాలు చాలావరకు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇటీవల కొన్నాళ్లుగా మాత్రం సూర్య సినిమాలు మన టాలీవుడ్ లో వరుసగా అపజయాలు చవి చూస్తున్నాయి. ఇటీవల వచ్చిన సూర్య లేటెస్ట్ మూవీ బందోబస్త్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత దారుణంగా కలెక్షన్స్ రాబడుతున్నట్లు తెలుస్తోంది. సూర్య హీరోగా గతంలో వచ్చిన వీడోక్కడే, 

బ్రదర్స్ వంటి విజయవంతమైన సినిమాలు తీసిన కెవి ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం కొన్ని చోట్ల ఈ సినిమా మినిమమ్ కలెక్షన్ ని కూడా రాబట్టలేని పరిస్థితి నెలకొని ఉందట. వాస్తవానికి మొన్న శుక్రవారం విడుదలైన ఈ బందోబస్త్ సినిమా, ఓపెనింగ్స్ పరంగా ఆయన గత సినిమా ఎన్.జీ.కె కంటే తక్కువ స్థాయిలో రాబట్టినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి రోజు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల లోపే గ్రాస్ రాబట్టిన ఈ సినిమా, 

రెండవ రోజు బాగా క్షీణించిందట. మొత్తంగా రెండు రోజులకు కలిపి గ్రాస్ రూ.3 కోట్ల లోపే కలెక్ట్ చేసిందట. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే రూ.10 కోట్ల వరకు ఉంది. మొదటి రెండు రోజుల వసూళ్లను బట్టి చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే అని అంటున్నారు. అయితే తమిళనాడులో మాత్రం ఈ సినిమా బ్రహ్మండమైన వసూళ్లతో హిట్ దిశగా దూసుకుపోతుండటం విశేషం. అయితే ఈ సినిమా రిలీజ్ రోజునే వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా కూడా రిలీజ్ అయి సూపర్ హిట్ సాదించడంతో ఆ ప్రభావం దీనిమీద పడి మరింతగా కలెక్షన్స్ తగ్గినట్లు చెప్తున్నారు. మరియు రాబోయే రోజుల్లో సూర్య ఇక్కడి బయ్యర్లను ఎంతవరకు సేఫ్ జోన్ లోకి తీసుకెళ్తాడో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: