కేవలం ఒక నెల వ్యవధిలో మన టాలీవుడ్ నుంచి విడుదలవుతున్న మరో భారీ బడ్జెట్ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న జరుపుకున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై మెగా ఫాన్స్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరి గొంతులో సినిమా మీద ఉన్న నమ్మకం మరియు ఈ చిత్రాన్ని ఎంత పట్టుదలతో మరియు ప్రేమతో చేశారో మనం తెలుసుకోవచ్చు.

అయితే నిన్న చిరంజీవి చెప్పిన దాని ప్రకారం రాజమౌళి బాహుబలి తీసిన తర్వాతే ఇటువంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ధైర్యం తెలుగు నిర్మాతలకు వచ్చిందని.... అతను ఇచ్చిన ఆత్మస్థైర్యం అంతా ఇంతా కాదని కొనియాడాడు. బాహుబలి మొదటి భాగం బడ్జెటు 180 కోట్లు కాగా రెండవ భాగానికి 250 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ 'సైరా' అనూహ్యంగా 270 కోట్ల ఖర్చు చేసుకుంది. దీంతోనే సైరా ఎంత ఘనంగా నిర్మించబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బడ్జెట్ విషయంలో రాజమౌళి బాహుబలి దాటేసిన సైరా మరొక విషయం లో కూడా ఆ జాతీయ అవార్డు చిత్రాన్ని అధిగమించింది.

ఇటువంటి చిత్రాలకు అత్యధిక బడ్జెట్ ఖర్చు అయ్యేది కేవలం వీఎఫెక్స్ షాట్లు కే. అతి భయంకరమైన పోరాట సన్నివేశాలకి అబ్బురపరిచే గ్రాఫిక్స్ జోడించి చాలా సహజంగా తీయాలంటే అత్యున్నత టెక్నాలజీలో చేయాలి వీఎఫెక్స్ షాట్లు తీయాలి. అయితే బాహుబలి చిత్రానికి 2300 వీఎఫెక్స్ షాట్లు తీయగా సైరా చిత్రానికి మాత్రం ఏకంగా 3,800 వీఎఫెక్స్ షాట్లు టెక్నాలజీతో తీశారు. ఇందులో చిరంజీవి డూప్ లేకుండా తానే అన్ని పోరాట సన్నివేశాలు చేసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అసాధారణ క్రేజ్ తో ముందుకుపోతున్న సైరా నాన్-బాహుబలి అనే ట్యాగ్ ను తీసేసి నాన్-సైరా కి తెర లేపుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: