నిన్న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచ్చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వర్షం పడుతున్నా నిరాటంకంగా, ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కి రాజమౌళి మరియు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ అని మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని అక్కడి విచ్చేసిన మెగా అభిమానులతో పాటు ఇక్కడ టీవీలో చూస్తున్న ప్రతి సినీ ప్రేక్షకుడికి మనసు ఉవ్విళలూరుతుంటుంది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాయి.

మొదటి నుంచే మితభాషి అయిన పవన్ కళ్యాణ్ ఇటువంటి వేడుకలకు హాజరు కావడం చాలా తక్కువ. అయితే చరణ్ ఇంత భారీ బడ్జెట్ సినిమాని తన అన్న చిరంజీవి కోసం నిర్మించడం మరియు అతను ఈ చిత్రానికి ఎంతో ఇష్టపడి గాత్రదానం కూడా చేసినందున పవన్ కళ్యాణ్ హాజరు కాక తప్పలేదు. స్టేజ్ పైన మరియు కింద మొదట్లో కొంచెం ఇబ్బందిగా కనిపించిన పవన్ కళ్యాణ్ మైక్ చేతపట్టుకున్నాక మాత్రం కుదురుకొని తన పంథా లో మాట్లాడి అభిమానులందరినీ ఉత్సాహపరిచాడు.

ఇక్కడ ముందుగా అతను అన్న మాటలు కొంతమందిని ఆశ్చర్యచకితులను చేశాయి. తనకు రక్తసంబంధం ఉన్న చిరంజీవికి తాను తమ్ముడినే అయినా ఇలాంటి వేడుకల్లో మాట్లాడేటప్పుడు మరియు అతని సినిమాలు చూసేటప్పుడు మెగాస్టార్ అభిమానిగా మారిపోతానని.... తాను కూడా మెగా అభిమానుల్లో ఒకడినని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. తనకు ఆయనకు తమ్ముడిగా ఉండడం కన్నా మెగా అభిమాన గా ఉండడం ఇష్టం అని.... ఎన్నో గొప్ప చిత్రాలు చేసిన చిరంజీవి అభిమానిగా వచ్చే గుర్తింపే తనకు ఎంతో గొప్ప అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడటం విశేషం. ఈ ఒక్క మాటతో పవన్ అక్కడ ఉన్న మెగా అభిమానులు అందరిని ఆనందంలో ముంచెత్తాడు అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: