నిన్న జరిగిన సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మెగా అభిమానులకు కన్నుల పండుగగా నిలిచింది. వారి ప్రియమైన కుటుంబంలోని సభ్యులంతా ఒక చోట హాజరు కావడం... వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి వారి అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా చాలా ఆనందపడ్డాడు. స్టేజీ పైన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అయిపోయి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో గతంలో చెప్పినట్లే తన జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని అభిమానుల ముందు ప్రస్తావించాడు పవన్.

తను ఇంటర్ చదివే సమయంలో పరీక్షలో ఫెయిల్ అవుతాడని చాలా భయపడ్డాడు అని అలాగే చివరికి ఫెయిల్ అయ్యాడని కూడా చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. మొన్న తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చూసిన తర్వాత తన హృదయం కలిచివేయబడింది అని అన్నాడు పవన్. తాను కూడా పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి యొక్క రివాల్వర్ తీసుకొని సూసైడ్ చేసుకోవటానికి ఆలోచించినట్లు పవన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. అదే సమయంలో తీసుకున్న ఎమోషనల్ నిర్ణయం నుంచి తాను ఎలా బయట పడ్డాడో కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్.

అదే సమయంలో చిరంజీవి గారి భార్య మరియు అతని తమ్ముడు అయిన నాగబాబు ఇద్దరు తనను ఓదార్చి.... నచ్చజెప్పి చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించాడు. అప్పుడు చిరంజీవి తనకు ధైర్యం చెప్పి జీవితంలో గెలుపోటములు సహజమని.... ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని.... గెలవాల్సింది జీవితంలో కాని ఇంటర్ ఏ మాత్రం కొలమానం కాదని అతనిలో స్ఫూర్తి నింపిన విషయం కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. దీంతో ప్రతి ఒక్క ఇంట్లో చిరంజీవి వంటి అన్నయ్య ఉంటే ఆ చావులు ఆగేవని ఇటువంటి అన్నయ్య ఉన్నందుకు తను ఎప్పటికీ గర్వపడుతూ అతని తమ్ముడిగా కాకుండా అభిమానిగా మిగిలిపోతాను అని పవన్ కళ్యాణ్ చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: