పవన్ కళ్యాణ్ కు అతని అభిమానులు అంటే ఎంత ప్రేమో.... తిరిగి అతని అభిమానులు ఆయనకు అంతులేని ప్రేమను ఎలా చూపిస్తారో అందరికీ తెలిసిందే. హద్దులు లేకుండా కట్టలు తెంచుకొని వస్తున్న ప్రేమతో ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని లక్షల మంది అభిమానులు పార్టీ కోసం కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి వారిద్దరి మధ్య బంధం ఈవెంట్లో బయటపడింది.

తరచుగా జరిగేటట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కింద అ జనసమూహంలోని ఒక ప్రేక్షకుడు ఎలాగోలాగా రక్షణ సిబ్బంది కళ్లు గప్పి పవన్ కళ్యాణ్ ను కౌగిలించుకునేందుకు వచ్చేశాడు. అయితే అతను పవన్ని చేరుకునేలోపే స్టేజ్ పైన ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అతనిని వచ్చి కొంచెం బలవంతంగా మరియు కఠినంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తుండగా పవన్ వారిపై విరుచుకు పడ్డాడు. ముందు అతనిని వదలమని చెప్పి తర్వాత "ఆప్ లోగ్ యాహా సే జాయియే" (ముందు మీరంతా ఇక్కడినుంచి వెళ్లిపోండి) అని ఒకటికి నాలుగు సార్లు చెప్పాడు.

అయినా వారు అభిమానిని పూర్తిగా వదలకపోయే సరికి ఒక్కసారిగా గట్టిగా అరవడంతో ప్రేక్షకుడిని పవన్ కళ్యాణ్ దగ్గరే వదిలేసి వారు వెళ్లిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా ప్రేక్షకుడిని కౌగిలించుకున్నాడు తర్వాత అతను కాళ్ళ మీద పడిపోతుంటే అడ్డుకొని అక్కడి నుంచి పంపించివేశాడు. దీనితో ఆ ప్రేక్షకుడికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటివరకు ఎన్నో సార్లు స్టేజీపైన హీరోలు మాట్లాడుతుంటే అభిమానులు వచ్చి కాళ్ళ మీద పడటం మామూలే కానీ దీనిని కావాలనే నిర్మాతలు చేస్తున్నారని కొన్ని సార్లు వార్తలు కూడా వచ్చాయి. అయినా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తాకేందుకు ఎంతో మంది ప్రేక్షకులు ఎగబడతారు కానీ ప్రతీ ఒక్కటి ప్లాన్ చేసింది కాదని అందరికీ తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: