గత రెండు నెలల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను ఇస్తున్నాయి. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలైనా, స్టార్ హీరోల సినిమాలైనా నిర్మాతలకు నష్టాలు తప్పటం లేదు. ఒకటీ అరా సినిమాలు హిట్టైనా బ్రేక్ ఇవెన్ అవుతున్నాయే తప్ప నిర్మాతలకు భారీ లాభాలను మాత్రం ఇవ్వటం లేదు. జులై 26వ తేదీన విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ విడుదలైంది. 
 
బ్లాక్ బస్టర్ హిట్ గీతా గోవిందం హీరో హీరోయిన్లు కలిసి నటించటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తొలిరోజే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బిలో యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమా వలన నిర్మాతలకు 7 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని సమాచారం. ఆగస్టు 9వ తేదీన నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మన్మథుడు 2 సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమాకు కేవలం 12 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని సమాచారం. 
 
ఆగస్టు 15వ తేదీన విడుదలైన శర్వానంద్ సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన రణరంగం సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు నష్టాలు వచ్చాయని సమాచారం. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఆగస్టు 30వ తేదీన వచ్చిన సాహో సినిమా ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు 45 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. 
 
నాని విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో సెప్టెంబర్ 13వ తేదీన విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమాకు రిలీజ్ రోజు యావరేజ్ టాక్ వచ్చింది. విడుదలైన మూడు రోజుల్లో 50 శాతం రికవరీ చేసిన గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు నాలుగవ రోజు నుండి డ్రాప్ అయ్యాయి. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో కాకపోయినా నష్టాలు మాత్రం తప్పటం లేదు. శుక్రవారం రోజు విడుదలైన గద్దలకొండ గణేష్( వాల్మీకి) సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. గత రెండు నెలల్లో టాలీవుడ్ లో విడుదలైన సినిమాల వలన టాలీవుడ్ ఇండస్ట్రీకి 70 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: