మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతారల కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్, నిన్న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఎంతో  అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి, మాస్ డైరెక్టర్ వివి వినాయక్ తదితరులు ఈ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథులుగా విచ్చేయడం జరిగింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, తమన్నా, అనుష్క శెట్టి, నిహారిక కొణిదెల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే నిన్నటి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, 

మన దేశం గర్వించదగిన స్వతంత్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారని, అటువంటి గొప్ప వ్యక్తిని గురించి నేటి యువత తప్పనిసరిగా తెలుసుకోవాలని అన్నారు. ఇకపోతే ఈ సినిమా ఒప్పుకున్నపుడు, దాని కోసం తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకుని షూటింగ్ లోకి ప్రవేశించానని, ఇక సినిమాలోని క్లిష్టమైన యాక్షన్ మరియు గుర్రపు స్వారీ సీన్స్ లో ఎటువంటి డూప్ అవసరం లేకుండా తానే స్వయంగా సాహసాలు చేసానని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. తన తనయుడు రామ్ చరణ్, ఈ సినిమా కోసం ఎంతో భారీగా ఖర్చుపెట్టాడని, ఇక ఆ భారీతనానికి తగ్గట్లు దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగిందని ఆయన అన్నారు. ఇక సినిమాలోని మిగతా ఆర్టిస్టుల గురించి మాట్లాడిన చిరంజీవి, 

ఈ సినిమాలో వీరా రెడ్డి పాత్ర గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. నిజానికి వీరారెడ్డి పాత్ర సినిమాలో చాలావరకు తన తోనే ట్రావెల్ అవుతుందని, అయితే చివరిలో వచ్చే ఒక ట్విస్ట్ తో ఆ పాత్ర మరొక విధంగా మారుతుందని అన్నారు. అయితే మెగాస్టార్ వ్యాఖ్యలను బట్టి జగపతి బాబే ఈ సినిమాలో మెయిన్ విలన్ అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయింది. నరసింహారెడ్డికి మొదటి నుండి మంచి అనునాయుడుగా వ్యవహరించే వీరారెడ్డి, మధ్యలో బ్రిటిష్ దొరలతో చేయి కలిపి, వారికి తొత్తుగా మారి, చివరకు నరసింహారెడ్డిని వారికి పట్టిస్తాడట. అయితే దీనిపై అధికారికంగా ఎక్కడా ప్రకటన లేనప్పటికీ, ప్రస్తుతం ఈ వార్త మాత్రం విపరీతంగా ప్రచారం అవుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం సైరా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: