రామ్ చరణ్  ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైరా నరసింహారెడ్డి సినిమా అమెరికా వ్యాప్తంగా వచ్చే నెల అక్టోబర్ 1 న విడుదల కాబోతోంది. రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచీ ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. చిరు గెటప్, సినిమాలో డైలాగులు , అమితాబ్ వంటి అగ్ర తారలు నటిచడంతో ఈ సినిమా వెండి తెరపై ఎప్పుడు ఎప్పుడు వెలుగుతుందో అంటూ ఆరాట పడుతున్నారు అభిమానులు.  దాంతో సినిమాపై అంచనాలని దృష్టిలో పెట్టుకుని మార్కెట్, గత సినిమాల రికార్డులుని కొల్లగొట్టాలని భారీ వ్యుహాలే రచిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే

 

అమెరికాలో రిలీజ్ అవబోతున్న సైరా సినిమా టిక్కెట్ల రెట్లు భారీగా పెంచేశారు. సైరా ప్రీమియం టిక్కెట్టు ధర 29 డాలర్లుగా నిర్ధారించారు. 2 వతేదీన టిక్కెట్టు ధరని 17 డాలర్లు గా నిర్ధారించారు. అయితే బాహుబలి సినిమా సమయంలో ప్రీమియం ధర 30 డాలర్లు పెట్టారని అందుకు అనుగుణంగా సైరా సినిమాని తీసుకున్న పంపిణీ దారులు 29 డాలర్లుగా నిర్ధారించారని ఎన్నారైలు వాపోతున్నారు. అయితే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రతీ సారి ఎన్నారైల జేబులుకి చిల్లు పడుతోంది అంటున్నారు కొందరు ఎన్నారైలు.

 

సహజంగా నలుగురు ఉన్న  ఫ్యామిలీ కలిసి వెళ్లి సినిమా చూడాలంటె 125 డాలర్లు అవుతుందని అదే ఫ్యామిలీ ప్రీమియర్ కి వెళ్ళాలంటే 200 డాలర్లు ఖర్చు అవుతుదని తెలిపారు. అగ్ర హీరోల చిత్రాలు అడ్డుపెట్టుకుని పంపిణీ దారులు అడ్డంగా దోచేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసిన Avengers Endgame సినిమా కేవలం 9 డాలర్లు దాటలేదు అంటూ సైరా సినిమా పై మండిపడుతున్నారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: