టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి..వస్తున్నాయి.  అయితే అందులో ఎప్పటికీ మరుపు రాని సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’మూవీ ఒకటి.  పాశ్చాత్య సంగీతం..తెలుగు సంగీతాన్ని ఎలా బ్రష్టు పట్టిస్తుంది..దాన్ని ఓ గురువు ఎలా విమర్శించి తెలుగు సంగీత ఔన్నత్యాన్ని చాటి చెప్పారు అన్నదే ఈ మూవీ సారాంశం.  ఈ మూవీలో తో రాజ్యలక్ష్మి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. నటిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 


చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన రాజ్యలక్ష్మి, టీవీ సీరియల్స్ లోను నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను ఇప్పటివరకు 300 సినిమాల్లో నటించానని, శంకరాభరణంలో చేసిన పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిదని పేర్కొన్నారు. తమిళం, కన్నడ, హిందీ భాషా సినిమాల్లో నటించానని, పెళ్లయిన తర్వాత సింగపూర్‌ వెళ్లిపోయానని, దాదాపు  పదేళ్ల తర్వాత తిరిగి వచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించాను.


ఒక సీనియర్ ఆర్టిస్ట్ ధోరణి మాత్రం నాకు చాలా బాధ కలిగించింది.నన్ను చెంపదెబ్బ కొట్టవలసిన ఒక సన్నివేశంలో నిజంగానే కొట్టేసింది పైగా సారీ కూడా చెప్పకుండా వెళ్లిపోయింది. దాంతో నాకు చాలా బాధ అనిపించింది..ఆ సమయంలో దర్శకులు వచ్చి ఆమె ఏదో ప్రెస్టేషన్ లో ఉన్నట్లుంది..అని సర్ధిచెప్పారు. ఆమె అలా ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదు. ఆ రోజు సెట్ కి రాగానే ఆమెకి గుడ్ మార్నింగ్ చెప్పకపోవడం వల్లనే నన్ను కొట్టిందనే విషయం ఆ తరువాత ఆమె మాటల వలన నాకు అర్థమైంది  అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: